రజనీకాంత్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ?

     Written by : smtv Desk | Mon, Sep 27, 2021, 06:08 PM

రజనీకాంత్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం ?

రెండ్రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి హైదరాబాదులో నాలాలు పొంగిపొర్లగా, ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ నాలాలో పడి గల్లంతయ్యాడు. అతడి పేరు గోపిశెట్టి రజనీకాంత్. విషాదకర రీతిలో రజనీకాంత్ శవమై తేలాడు. ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతదేహాన్ని నెక్నాంపూర్ చెరువులో ఓ డ్రైనేజీ కలిసే చోట గుర్తించారు.

రజనీకాంత్ వర్షం కురుస్తున్న సమయంలో మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద నడుచుకుంటూ వెళుతూ నాలాలో పడిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. దురదృష్టవశాత్తు రజనీకాంత్ మరణించడంతో, అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా రజనీకాంత్ నాలాలో పడిపోయిన స్థలంలో గత మూడు నెలలుగా నిర్మాణ పనులు జరుగుతున్నా, అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రజనీకాంత్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు.





Untitled Document
Advertisements