ఋషులు ఎన్ని తరగతులు? వారేవరు?

     Written by : smtv Desk | Tue, Sep 28, 2021, 12:57 PM

ఋషులు ఎన్ని తరగతులు? వారేవరు?

'రా' అనే అక్షరం అర్థం శబ్దం అని రుషి అనే పదం అక్షరానికి మూలమని వ్రాతలేనప్పుడు వేదాలు శాస్త్రాలు వీరి నోటి నుండి వెలువడినవి ఆర్ష భారత పదాలు కూడా రుషుల నోటి నుండి వెలువడినవి వేదాలు రుషుల ఉత్తేజం ఆధ్యాత్మిక దృష్టి కలిగి వెలువడినవి. భారతదేశం ఎందరో మహర్షులకు జన్మనిచ్చింది. అన్ని వర్గాల ప్రజలను లోనూ పురుషులు ఉన్నారు. 48 వేల మంది ఋషులు ఉన్నట్లు పురాణాలు తెలియజేయుచున్నాను. శ్రీరాముడు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చినపుడు భారతదేశం నలుమూలల నుండి ఋషులు అయోధ్యకు వచ్చినట్లు చెప్పబడింది. తూర్పు ప్రాంతం నుండి విశ్వామిత్ర, యవక్రైత, రైద్య మొదలగువారు, దక్షిణం నుండి దత్తాత్రేయ, వాల్మీకి, అగస్త్యులు మొదలగువారు, పశ్చిమం నుండి వృశం, కలిశ, నారద, అష్ట వక్ర , శుక్ర, భృగులు మొదలగువారు, ఉత్తరం నుండి అత్రి, దుర్వాస , తుంబుర ,మాతంగ, సప్తరుషులు మొదలగు వారు వచ్చారు. రుషులు మూడు తరగతులు బ్రహ్మ రుషులు, రాజా రుషులు ,దేవర్షులు. ఉదాహరణకు వశిష్టుడు బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు రాజర్షి , కశ్యపుడు దేవర్షి.





Untitled Document
Advertisements