నోటి దుర్వాసనకు వంటింటి చిట్కాలతో చెక్!

     Written by : smtv Desk | Tue, Sep 28, 2021, 12:59 PM

నోటి దుర్వాసనకు వంటింటి చిట్కాలతో చెక్!

మనం ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్లు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వాలి అంటే మన మొహం పై చిరునవ్వు, ప్రశాంతతతో పాటు నోటి నుండి ఎటువంటి దుర్వాసన రాకుండా ఉండాలి. అయితే కొంతమందిలో చక్కటి చిరునవ్వు ప్రశాంతత ఉన్నాకూడా నోట్లో నుండి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటి వారితో ఎవరైనా మాట్లాడాలి అంటే సంకోచిస్తూ ఉంటారు. అయితే వీరు బ్రష్ చేసుకోరా అంటే... చక్కగా బ్రష్ చేసుకుంటారు. రెండు పూటలా బ్రష్ చేసినా కూడా వారి నోట్లో నుంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. అటువంటి వారికోసం  కొన్ని వంటింటి చిట్కాలు.
* ఏలకుల గింజలను ప్రతిరోజు రోజుకు ఐదారుసార్లు గా నములుతూ ఉంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది.
* భోజనం చేసిన తర్వాత చిన్న దాల్చినచెక్క ముక్కను నోటిలో వేసుకొని చప్పరిస్తుంటే నోటి దుర్వాసన తగ్గిపోయి దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి.
* భోజనం చేసిన తర్వాత లవంగము చప్పరిస్తుంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది.
* ప్రతిరోజూ కొద్దిగా వామును నమిలి తింటుంటే నోటిదుర్వాసన తగ్గిపోతుంది.
* చెరుకుగడను పండ్లతో నమిలి తింటుంటే దంతాలు చిగుళ్లు గట్టిపడతాయి కాకుండా నోట్లోని క్రిములు నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
* ఉప్పును లవంగాలను కలిపి నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసనతో పాటు ఆయాసం కూడా తగ్గిపోతుంది.





Untitled Document
Advertisements