శాకాహారుల్లోనే కొవ్వు ఎక్కువ ఉంటుంది

     Written by : smtv Desk | Wed, Sep 29, 2021, 08:58 PM

 శాకాహారుల్లోనే కొవ్వు ఎక్కువ ఉంటుంది

మాంసాహారుల్లోనే కొవ్వు ఎక్కువ’ తరచూ వినిపించే మాట ఇది. కానీ, శాకాహారులే ఎక్కువ కొవ్వు వినియోగిస్తారని హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) విశ్లేషణలో తేలింది. శాకాహారుల్లోనే కొవ్వు నిల్వలు అధికమని వెల్లడించింది. ఎన్‌ఐఎన్‌ పరిశోధకులు ‘ఇంటర్నేషనల్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా 2019’ కోసం న్యూట్రిషనల్‌ డాటాను విశ్లేషించారు. 7 మెట్రో నగరాలు హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి ప్రజల విజిబుల్‌ ఫ్యాట్‌ (నూనె, వెన్న, నెయ్యి, కొవ్వు వంటివి) వినియోగంపై అధ్యయనం చేశారు. అసెస్మెంట్‌ ఆఫ్‌ విజిబుల్‌ ఫ్యాట్‌ కన్సంప్షన్‌ అనే నివేదికను తయారుచేశారు. మాంసాహారుల కంటే శాకాహారులే కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నట్టు తేల్చారు. శాకాహారులు రోజుకు సగటున 40.4 గ్రాముల విజిబుల్‌ ఫ్యాట్‌ తీసుకుంటుండగా.. మాంసాహారులు 30.1 గ్రాములే వినియోగిస్తున్నారని వెల్లడించారు. కనిపించే కొవ్వు.. శాకాహారులు తరచూ తినే తెల్ల బియ్యం, పరోటా వంటి ఆహార పదార్థాల్లో వినియోగించే నూనెల్లో ఎక్కువ ఉంటుందని గుర్తించారు. ఏడు మహానగరాల్లో హైదరాబాద్‌లోనే తక్కువ విజిబుల్‌ ఫ్యాట్‌ వినియోగిస్తున్నట్టు తేల్చారు.





Untitled Document
Advertisements