'లవ్ స్టోరీ'....తెలుగు రాష్ట్రాల్లో 21.18 కోట్ల షేర్

     Written by : smtv Desk | Thu, Sep 30, 2021, 11:57 AM

'లవ్ స్టోరీ'....తెలుగు రాష్ట్రాల్లో 21.18 కోట్ల షేర్

సెకండ్ వేవ్ తరువాత చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా, థియేటర్ల దగ్గర ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన సినిమాలు కొన్నయితే, అసలు వచ్చాయో లేదో తెలియని సినిమాలు మరి కొన్ని. అలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు వచ్చిన 'లవ్ స్టోరీ' ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ నెల 24వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి 5 రోజుల్లో ఒక్క నైజామ్ లోనే 10.08 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి 21.18 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26.66 కోట్ల షేర్ ను .. 46.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేదా? అనే ఈ పరిస్థితుల్లో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ సినిమా ఇంకా అదే జోరును కొనసాగిస్తూ ఉండటంతో, ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది.





Untitled Document
Advertisements