గాడ్సే జిందాబాద్ అంటూ మన దేశం పరువు తీస్తున్నారు

     Written by : smtv Desk | Sat, Oct 02, 2021, 02:55 PM

గాడ్సే జిందాబాద్ అంటూ మన దేశం పరువు తీస్తున్నారు

ఇవాళ దేశమంతా గాంధీ జయంతి ఉత్సవాలను జరుపుకొంటోంది. అయితే, కొందరు గాంధీ విమర్శకులు మాత్రం.. ట్విట్టర్ లో గాడ్సే జిందాబాద్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని వేల మంది ఆ హాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

‘‘ప్రపంచానికి భారత్ ఎప్పటికీ ఆధ్యాత్మిక గురువు. కానీ, దానికి కారణం మహాత్మా గాంధీనే అన్న విషయాన్ని మరచిపోవద్దు. తన బోధనల ద్వారా ప్రపంచానికి ఆధ్యాత్మికతను పరిచయం చేశారు. అందువల్లే ఇప్పటికీ మనం ఆధ్యాత్మికతలో గొప్ప శక్తిగా ఉన్నాం. కానీ, గాడ్సే జిందాబాద్ అంటూ చాలా మంది మన దేశం పరువు తీస్తున్నారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, 1869 అక్టోబర్ 2న మహాత్ముడు పోరుబందర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అహింసా మార్గంలో పోరాటం చేసి, దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన గాంధీని 1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు.





Untitled Document
Advertisements