అష్టావక్రుడు సుప్రభను ఏవిధంగా వివాహమాడాడు!

     Written by : smtv Desk | Mon, Oct 04, 2021, 02:42 PM

అష్టావక్రుడు సుప్రభను ఏవిధంగా వివాహమాడాడు!

అష్టావక్రుడు ఉద్దాలకుని శిష్యుడు. ఏకపాదుని పుత్రుడు. ఇతను పుట్టుకతోనే పండితుడు. తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చదివే శ్లోకం పఠనంలో తప్పులు ఉన్నాయని చెప్పాడు. అతనికి తండ్రి కోపించి ఇతన్ని ఎనిమిది వంకరలతో జన్మించమని శపించాడు. అలా వికృతరూపం దాల్చిన అష్టావక్రుడు ఉద్దాలకుని కుమారుడు. తను  శ్వేతకేతునితో కలిసి చదువుకున్నాడు. ఇతడు జన్మించక ముందే తండ్రి జనకమహారాజు కొలువులో జరిగిన పాండిత్య పోటీలో ఓడిపోయి పోటీ నిబంధన ప్రకారం దగ్గరలోని నదిలో పడి మరణించాడు. అష్టావక్రుడు ఉద్దాల గుడి కుమారుని ద్వారా ఈ విషయం తెలుసుకొని బాల్యంలోనే అదే రాజు కొలువులో అదే పండితుణ్ణి ఓడించాడు. నిబంధన ప్రకారం అతడు నదిలో పడి మరణించగా అష్టావక్రుడి తండ్రి బ్రతికి వచ్చాడు. వదాన్యముని కుమార్తె సుప్రభను వివాహం చేసుకోగోరి అతడిని అడుగగా ఉత్తర దిక్కుగా ప్రయాణించి శివపార్వతులను ప్రార్థించి ఆ తరువాత అచటగల అందమైన కన్యతో మాట్లాడి తిరిగి వస్తే ఇప్పుడే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అంటాడు. అష్టావక్రుడు అలాగే ఉత్తర దిక్కుకి వెళ్లి శివపార్వతులను పూజించి ఆ తరువాత మరింత ముందుకు వెళ్లి ఏడుగురు అందగత్తెలను చూచి అందరిలో పెద్దదైన ఉత్తరతో మాట్లాడతాడు. ఆమె అతన్ని వివాహం చేసుకోమనగా ఇతడు నిరాకరిస్తాడు. ఆమెను ఆవిధంగా నిరాకరించి పందెంలో గెలిచి సుప్రభను  వివాహమాడాడు.





Untitled Document
Advertisements