శ్రీమహాలక్ష్మిని అశ్వంగా పుట్టమని శ్రీమహావిష్ణువు శపించుటకు కారణం?

     Written by : smtv Desk | Mon, Oct 04, 2021, 02:45 PM

శ్రీమహాలక్ష్మిని అశ్వంగా పుట్టమని శ్రీమహావిష్ణువు శపించుటకు కారణం?

ఉచైశ్రవం క్షీర సాగరమధనంలో వెలువడిన అశ్వము. ఇంద్రుడు దీన్ని తీసుకొని తన వాహనముగా ఉపయోగించుకున్నాడు. ఈ గుర్రం యొక్క తోక పై వెంట్రుకలు తెలుపా, నలుపా అన్న వివాదంతో కద్రువ, వినతులు పందెం వేసుకొని కద్రువ మోసంతో వినత దాసి అయింది. సూర్యుని కుమారుడు రేవంతుడు ఇంద్రుని అనుమతితో ఈ అశ్వం పై శ్రీమహావిష్ణువు దర్శనానికి వైకుంఠం వెళ్లగా లక్ష్మీ దేవి కూడా క్షీర సాగరమధనంలో  పుట్టినందున వరుసకు సోదరుడైన నందున ఈ అశ్వాన్ని చూసి ఏకాగ్రత కోల్పోయింది. శ్రీమహావిష్ణువు దీనికి అపోహ చెంది శ్రీలక్ష్మి దేవిని ఆడ అశ్వంగా పుట్ట గలవని శపిస్తాడు. ఈ శాపం వల్ల ఆడ అశ్వంగా శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఈమె హెహయ  వంశానికి మూలము అయింది.





Untitled Document
Advertisements