మేఘనాధుడికి ఇంద్రజిత్తు అనే పేరెలా వచ్చింది

     Written by : smtv Desk | Mon, Oct 04, 2021, 02:46 PM

మేఘనాధుడికి ఇంద్రజిత్తు అనే పేరెలా వచ్చింది

రావణ మండోదరిలకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు మేఘనాథుడు. ఇతడు ఇంద్రుని జయించడం వల్ల ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. మేఘనాథుడు శైవ యాగం చేసి శివుని మెప్పించి సమాధి కళను పొందుతాడు. దీని వల్ల అతడు అందరిలో ఉన్నా ఎవరికీ కనిపించడు. అతనికి మాత్రం అందరూ కనిపిస్తారు. ఇంద్రజిత్తు అను పేరుకు కారణం అతని విజయాలు. రావణుడు దేవలోకం పై దండెత్తుతాడు. రాక్షస సేన దేవలోకాన్ని చుట్టుముట్టింది. ఇంద్రుడు విష్ణువును ఆశ్రయించగా అవును నీ మరణానికి ఇంకా సమయము రాలేదు అన్నాడు. వచ్చిన ఇంద్రుడు రావణుడితో తలపడ్డాడు. మేఘనాథుడు శివుడు తనకు ఇచ్చిన కరమైన మాయా రూపంలో ఇంద్రుని కుమారుడు జయంతుని అస్త్రాలతో ముంచెత్తగా జయంతుడు పడిపోయాడు. ఇంద్రుడి తండ్రి పులోముడు జయంతుడిని తీసుకుని వెళ్ళి సముద్రంలో దాచాడు. ఈ విషయం తెలిసి కోపితుడైన ఇంద్రుడు వజ్రాయుధంతో రావణుని దెబ్బతీశాడు. క్రింద పడగా ఇంద్రజిత్తు మాయా రూపంలో ఇంద్రుని రథమెక్కి తన్ని బంధించాడు. అప్పుడు రావణుడు కుమారునితో కలిసి ఇంద్రుని లంకానగరం తీసుకొని వచ్చాడు. లంకను చేరి ఇంద్రుడిని  వదలమని కోరగా ఇంద్రజిత్తు మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రాహ్మణ కోరాడు రావణుడు. అది అసాధ్యమని నీవు ఒక యజ్ఞం చేస్తే ఓ రథము గుర్రాలు ప్రత్యక్షమవుతాయి అని దాని పై నుండి నీవు యుద్ధం చేస్తే నీకు ఓటమి లేదని వరమిస్తాడు. అప్పుడు రావణుడు ఇంద్రుని వదిలి వేస్తాడు. ఇంద్రుని జయించి డం వల్ల ఇంద్రజిత్తు అనే నామం సార్థకమైంది. రామ రావణ యుద్ధ తీవ్రరూపం దాల్చింది. లక్ష్మణుడికి, ఇంద్రజిత్తుకు ఘోర యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు తన మాయాజాలంతో సీతను వధించినట్లు భ్రమింపజేస్తాడు. రామలక్ష్మణులు, హనుమంతుడు దుఃఖితులై యుద్ధరంగాన్ని వదిలివెళతారు. రావణుడు ఈ సమయంలో బ్రహ్మ చెప్పిన యజ్ఞం ప్రారంభించడానికి నికుంబిలకు  వెళ్తాడు. విభీషణుడు  ఈ విషయాన్ని రామునికి తెలియజేసి యజ్ఞం పూర్తి కాకముందే అతనితో యుద్ధం చేయాలని చెప్పాడు. వెంటనే రామలక్ష్మణులు అక్కడికి చేరి పూర్తికాకుండానే  ఇంద్రజిత్తు లక్ష్మణుడితో తలపడి అతని చేతిలో మరణిస్తాడు.





Untitled Document
Advertisements