పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్... రిస్క్ లేకుండా రూ.20 లక్షల లాభం

     Written by : smtv Desk | Tue, Oct 05, 2021, 06:30 PM

పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్... రిస్క్ లేకుండా రూ.20 లక్షల లాభం

పోస్టాఫీస్‌లో పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు పెట్టడం వల్ల కచ్చితమైన రాబడి పొందొచ్చు. అలాగే ఎలాంటి రిస్క్ ఉండదు.

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ NSC కూడా ఒకటి. ఇందులో డబ్బులు పెట్టడం వల్ల కచ్చితమైన లాభం పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే డబ్బులు పెడితే ఐదేళ్ల తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా ఉండొచ్చు. ఎన్ఎస్‌సీ స్కీమ్‌కు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. వడ్డీ మారొచ్చు. లేదంటే స్థిరంగా ఉండొచ్చు.

ఇకపోతే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌లో డబ్బులు పెడితే ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.100 నుంచి కూడా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఐదేళ్లలో రూ.20.85 లక్షలు పొందాలని భావిస్తే.. మీరు రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రూ.6 లక్షల లాభం వస్తుంది. ఇంకా సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.





Untitled Document
Advertisements