పంచమాంగల్యాలు అనగానేమి?

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 11:21 AM

పంచమాంగల్యాలు అనగానేమి?

మన సనాతన హైందవ సంస్కృతి లో వివాహం జరిగిన స్త్రీలంతా భర్త క్షేమం కోసం అయిదవతనం ఉట్టిపడేలా అలంకరణను మాంగల్యాలు అంటారు.
వివాహమైన స్త్రీలు ఈ పంచ మాంగల్యాలు అన్నివేళలా ధరించి నట్టింట్లో మహాలక్ష్మి లా తిరుగుతూ భర్తకి ఇంట్లో వాళ్లందరికీ కనిపిస్తే గనుక భర్తకి ఆయుష్షు వృద్ధి, మెట్టినింట్లో లక్ష్మీ వృద్ధి  అవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి... కానీ నేటి పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీలు ఆ పంచమాంగల్యాలకి విలువ లేకుండా చేస్తున్నారు.  బొట్టు, గాజులు ధరించడం అంటే రాష్ వస్తుంది అంటారు. పువ్వులు పెట్టుకొని అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. మంగళ సూత్రాలను, మెట్టెలను అలంకరణ వస్తువులు గా చూస్తున్నారు. ఇంతకీ ఈ పంచమాంగల్యాలు ఏంటో చూసేద్దామా..
నుదుట, పాపిట కుంకుమ, మెడలో మాంగల్యం, తలలో పూలు, చేతులకు గాజులు, కాలికి మెట్టెలు. ఇవే పంచమాంగల్యాలు. ఈ ఐదు వివాహమైన స్త్రీ అన్నివేళలా ధరించాలి. భర్తకి ఇవన్నీ ధరించే కనిపించాలి.





Untitled Document
Advertisements