పండగ వేళ తప్పక పూజించాల్సిన ముగ్గురమ్మలు!

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 11:22 AM

పండగ వేళ తప్పక పూజించాల్సిన ముగ్గురమ్మలు!

పండగ వేళ ఆ భగవంతుడిని పూజించడం హైందవ సాంప్రదాయంలో ఒక భాగం. పండగైనా, పర్వదినమైన, శుభకార్యమైనా విశేషం ఏదైనా సరే విధిగా భగవంతుని పూజ చేయడం తప్పనిసరి. మన సంస్కృతిలో అమ్మవారికి ఉన్న గీత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  దేవీనవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం పరిపాటి. కాళీమాతగా ప్రసిద్ధికెక్కిన అమ్మవారిని రకరకాల పేర్లతో ఈ తొమ్మిది రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వాటిలో ముఖ్యమైన మూడు రూపాల గురించి తెలుసుకుందాం.
కాళికాదేవి:- నాలుగు చేతులతో, నల్లని రూపంతో భీకర అవతారంతో ఉంటుంది కాళికా అమ్మవారు. దుష్టశక్తుల్ని వదిలించే కత్తి ఒక చేతిలో, దుష్టశక్తి తలను మరోచేత్తో ధరించి ఉంటుంది. మరో రెండు చేతులతో భక్తులకు వరాల్ని, అభయాన్ని ఇస్తూ ఉంటుంది. మెడలో పుర్రెల దండ ఎర్రబారిన మూడు కన్నులు, బయటకు సాగిన నాలుకతో ఈ కర అవతారంలో ఉంటుంది. ఇవన్నీ కాళికామాతలోని అపారత్వానికి, దుష్టశక్తుల వినాశనానికి చిహ్నాలు.
లక్ష్మీదేవి:- సిరి సంపదలు, అదృష్టానికి ' హేతువైన లక్ష్మీదేవి కలువ పువ్వు ని రెండు చేతులతో పట్టుకుని ఉంటుంది. కలువపువ్వు స్వచ్ఛతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి చిహ్నం. లక్ష్మీదేవిని పద్మ, కమల అంటారు. అందమైన దేవతగా 'శ్రీ' అని కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి పక్కన ఉండే ఐరావతం విజ్ఞానానికి, రాచరికానికి చిహ్నంగా భావిస్తారు.
సరస్వతి దేవి:-  చదువుల తల్లి సరస్వతీ దేవి పద్మంపై కూర్చుని, తెల్లని హంస పక్కన ఉంటుంది. దీనిని అందానికి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. వీణని చేత ధరించి వేదాలు పలికిస్తుంది. పుస్తకం, వీటి పాత్ర ఆమె వద్ద ఉంటాయి. మతాచారాలకు, ఆధ్యాత్మిక సంబంధిత ప్రక్రియలకు, విజ్ఞానానికి ప్రతీక సరస్వతీదేవి.





Untitled Document
Advertisements