రామ లక్ష్మణులకు సుగ్రీవునితో మైత్రి ఏ విధంగా ఏర్పడింది?

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 06:44 PM

రామ లక్ష్మణులకు సుగ్రీవునితో మైత్రి ఏ విధంగా ఏర్పడింది?

కబంధునికి  శాప విమోచనం కలిగించిన రామలక్ష్మణులతో రామచంద్రతండ్రి సీతామాత అన్వేషణలో  సుగ్రీవుని సహాయం మీకు తప్పక అవసరం అవుతుంది. కావున మీరు సుగ్రీవునితో మైత్రి చేయవలసిందిగా కోరుతున్నాను. సుగ్రీవ మైత్రి మీకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్తాడు. కబంధుని మాటలు విన్న శ్రీరామడు సుగ్రీవుని కనుగొనే ప్రయత్నంలో శబరికి శాపవిమోచనం కలిగించి అడవిలో ప్రయాణిస్తూ సుందరమైన పంపా సరస్సు చేరారు. అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. సరసు ప్రక్కనే ఋష్యమూక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పైన సుగ్రీవుడు అనే వానర రాజు తన మంత్రులు సామంతులులతో నివసిస్తున్నాడు.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఇద్దరు గొప్ప వానరవీరులు. వాలి మహావీరుడు ఆయన కిష్కింధకు రాజు, వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమ. ఈ అన్నదమ్ములు ఇద్దరికీ వైరం ఏర్పడింది. బలవంతుడైన వాలి సుగ్రీవుని కొట్టి కిష్కింద నుంచి వెళ్లగొట్టి అతని భార్యను కూడా చెరబట్టాడు. సోదరుని చర్యలు చూసిన సుగ్రీవుడు చేసేదేమీలేక ఋష్యమూక పర్వతంపై తన పరివారంతో నివసిస్తున్నాడు. సుగ్రీవుని మంత్రి ఆంజనేయుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులను కలిశాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులకు నమస్కరించి తన గురించి తమ రాజు సుగ్రీవుని గురించి తెలియజేశాడు.
అందుకు రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. సుగ్రీవునితో స్నేహం చేయాలని రామలక్ష్మణులు ఆంజనేయుని కోరారు. అప్పుడు ఆంజనేయుడు రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతం పైన ఉన్న సుగ్రీవుని వద్దకు తీసుకొని పోయాడు. రాముడు, సుగ్రీవుడు ఒకరి విషయం ఒకరు చెప్పుకున్నారు. ఇద్దరూ భార్యలను పోగొట్టుకున్న వారే! ఇద్దరూ రాజ్యం లేని రాజులే! ఒకరికొకరు సహకరించుటకు  ఒప్పుకున్నారు.' కిష్కింధకు సుగ్రీవుని రాజును చేస్తానని మాట ఇచ్చాడు రాముడు. సీత జాడ వెతికి తెలియజేస్తాను' అని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. ఆ విధంగా రామలక్ష్మణులకు సుగ్రీవునితో మైత్రి కుదిరింది. ఆనాటి నుండి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతంపైనే ఉండిపోయారు.





Untitled Document
Advertisements