శ్యమంతకమణి శ్రీకృష్ణుని వద్దకు ఏవిధంగా చేరింది!

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 10:02 AM

శ్యమంతకమణి శ్రీకృష్ణుని వద్దకు ఏవిధంగా చేరింది!

శమంతకమణి ఇది ఒక గొప్ప మణి. దీన్ని సూర్యుడు సత్రాజిత్తుకు ఇస్తాడు. దీనివల్ల రోజుకు ఎనిమిది బారువుల బంగారం లభిస్తుంది. శ్రీకృష్ణుడు ఒకసారి దీన్ని అడుగగా అతడు నిరాకరిస్తాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు వేటకు వెళుతూ ఈ మణిని తీసుకుని వెళ్లగా ఓ సింహం ఇతన్ని చంపుతుంది. జాంబవంతుడు ఈ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు. మణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుని చంపాడని అపవాదం రాగా దాన్ని తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు మణి వెతకడానికి వెళ్లి జాంబవంతుణ్ణి ఓడించి ఆమణిని  దక్కించుకుంటాడు. అప్పుడు జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ మణిని తిరిగి సత్రాజిత్తుకి  ఇవ్వగా అతడు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత శతధన్వుడు అను రాజు ఈ మణి కోసం సత్రాజిత్తును చంపగా శ్రీకృష్ణుడు శతధ్వనుని  వధిస్తాడు. ఆమణి శతధ్వనుని కుమారుడు భోజుని దగ్గర నుండి అక్రూరుడు తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చాడు.





Untitled Document
Advertisements