పోర్న్ చూస్తున్నారా అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 10:03 AM

పోర్న్ చూస్తున్నారా అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒకప్పుడు వివాహం జరిగింది అంటే కష్టమైనా, నష్టమైనా కడవరకు కలిసి ఉండాలి అనుకునేవారు. మరి నేడు చిన్న చిన్న సమస్యలకు కూడా విడాకులు తీసుకోవడమే పరిష్కారంగా భావిస్తున్నారు.
అసలు నేటి జంటల మధ్య విడాకులకు దారి తీసే పరిస్థితులు ఏమిటి అంటే 75 శాతం జంటలలో వారి పడకగదిలో మొదలైయ్యే సమస్యలే విడాకులకు దారితీస్తున్నాయి అంటున్నారు నిపుణులు.
ఎందుకు అలా అంటారా... విచ్చలవిడి స్వేచ్ఛను కోరుకోవడమే అందుకు ప్రధాన కారణం. ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ భాగస్వామి యొక్క ప్రేమని పొందడానికి బదులు భాగస్వామిని అసహనానికి గురిచేస్తు వారి కోపానికి కారణం అవుతున్నారు. అసలు వీరు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అంటారా?  అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..
ప్రస్తుతం "సెక్స్ అన్నది నాలుగు గోడల మధ్య జరిగేది! అది నలుగురిలో కూర్చుని చర్చించేది కాదు అని!" ఇలాంటి సొల్లు మాటల వల్లనే సెక్స్ అన్నది ఓ బాడ్ యాంగిల్ లోకి పోయి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది.
ఆకలి, దాహం, నిద్ర, కోపం, బాధ వీటన్నింటికీ ఆపాదించిన అదే సహజత్వాన్ని సెక్స్ లో ఎందుకు అప్లై చేయలేము...
దీనికంతటికీ కారణం కచ్చితంగా సెక్స్ని  సాధారణ స్థాయిలో చూడలేక పోవడమే! సినిమాల్లో రేప్ సీన్లు పెడితే తప్పు లేదు అది చూస్తారు!  కానీ డైరెక్ట్ గా పోర్న్ చూస్తే తప్ప అనే వాదన నేటి యువతలో కూడా కనిపిస్తుంది.
మన దేశంలో స్త్రీలకు సెక్సు విషయంలో సరైన ఎడ్యుకేషన్ లేక వెనుకబడ్డారు అంటారు. పాశ్చాత్య దేశాలలో స్త్రీల విచ్చలవిడి శృంగారానికి ఆకర్షితులయ్యే ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ స్త్రీలను ఈ విషయంలో ఎడ్యుకేట్ చేసి వారికి కూడా స్వేచ్ఛను ఇస్తున్నాము అంటూ విర్రవీగుతూ ఉంటారు.
అసలు మన దేశంలో స్త్రీలకు నాకు సెక్స్ కావాలి! అని అడిగే ధైర్యం ఉందా? బెడ్రూంలో సరైన సుఖం దొరక్క బాధపడే స్త్రీలు ఎందరో ఉన్నారు. ఈ విషయంలో మరింత నైపుణ్యం కోసమే పోర్న్ చూడడం అంటారు. కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నట్టే సెక్స్ విషయంలోనూ పోర్న్ చూడడం అలాంటిదే  అంటూ పార్ట్నర్ మీద ఒత్తిడి తెస్తూ విడాకులకు కారణం అవుతున్నారు.

నిజమైన సెక్స్ అంటే ఏమిటి? ఓ సంస్కృత శ్లోకంలో చెప్పినట్లుగా..
" ఆహారశ్చైవ నిద్రాచ భయం మైథునమేవచ!
  పశ్వాదీనాంచ సర్వేషామ్ సాధారణ మీతిరితం!!
  చతుర్శ్వే వానురక్తోయ  స్సమూర్ఖోహ్యాత్మఘాతకః!
  మనుష్యణామయం ధర్మ స్స్వబంధచ్ఛేదనాత్మకః!!

అంటూ ఆ విషయం శాస్త్రమే చెప్తుంది. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం..
" ఆహారము, నిద్ర, భయము, మైధునం అంటే సెక్స్ ఈ నాలుగు పశువుల అన్నింటికీ సమానంగా, సాధారణంగా ఉండే సహజమైన విషయాలు. కానీ ఈ నాలుగింటి యందే అనురక్తుడై నిరంతరం వీటియందు తన మనసును లగ్నం చేస్తూ ఉండేవాడు మూర్ఖుడే కాదు ఆత్మఘాతకుడు కూడా! అంటుంది శాస్త్రం.
ఈ నాలుగు విషయాల్లోని బలహీనతలను జయించి, వీటిని ఉత్తమ స్థితికి తీసుకువచ్చి ఇంద్రియ నిగ్రహం ఏర్పడినప్పుడే పశుస్థితి నుండి మనిషిగా మారతాడు.
అసలు పోర్న్  చూసి ఉద్దీపన చెంది సుఖాన్ని అనుభవిస్తూ భార్య భర్తల కలయిక లోని అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అంటే నేటి యువతకు సెక్స్ మాత్రమే తెలుసు రొమాన్స్ తెలియదు.
మనదేశంలో స్త్రీలు సెక్స్ కావాలని కోరుకునే స్వేచ్ఛ లేదు అని అంటారు. కానీ ఏ స్త్రీ అయినా చివరకు ధైర్యం చేసి సెక్స్ కావాలని అడగగలేదేమో కానీ రొమాన్స్ కావాలి అని అడగలేదు. రొమాన్స్ అంటేనే తెలియని వ్యక్తిని.
నిజానికి దంపతులు కేవలం 20 శాతం మంది మాత్రమే సెక్స్ లో తృప్తి చెందగలరు. మిగతా 80 శాతం జంటలకు రొమాన్స్ కావాలి. తెలివి పెరుగుతున్న కొద్దీ రొమాన్స్ అవసరం కూడా పెరుగుతూ పోతుంది. కానీ ఈ విషయాన్ని నేటి యువత అర్థం చేసుకోవడంలో వెనకబడి పోతుందనే చెప్పాలి.
సెక్స్ పశువులు కూడా చేయగలవు, మనస్సు, శరీరం తంత్రులను మీటుతూ హృదయవీణ రాగం తెలిసిన మనిషి మాత్రమే రొమాన్స్ చేయగలడు. ఇటువంటి రొమాన్స్ తెలిసిన భర్త కోసం స్త్రీ ఎదురుచూపు.
కేవలం సెక్స్ అంటే 15 నిమిషాల నుండి అరగంట పాటు వేగంగా రెండు శరీరాల మధ్య జరిగే ఒరిపిడి. అది కేవలం ఆవేశం. ఆవేశం చల్లరగానే చెరొక వైపు మొహం పెట్టుకొని పడుకోవడం. ఉదయం లేవగానే మళ్ళీ యధావిధిగా ముఖం మాడ్పులు లేదా ఫోన్లో తలదూర్చడం. రోజంతా రుసరుసలు ఒకరినొకరు నిందించుకోవడం అందుకే 60 శాతం విడాకులకు మూలం పడకగదిలో ఎదురయ్యే సమస్యలే.
అసలు ఈ రొమాన్స్ అంటే ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. ఎలా చేయాలి అనేది కూడా అర్థం కాదు. అయితే ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు. మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోవాలి అంతే ఏవిధంగా అంటారా.
మొదట శరీరాన్ని చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. అందుకు వ్యాయామం తప్పనిసరి. క్రమం తప్పకుండా వాకింగ్ అలాగే చిన్నపాటి ఎక్స్ర్సైజులు చేస్తూ ఉండాలి.
మనసుని వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
మనసులో వ్యతిరేక, అనుకూల భావాలు పెట్టుకోకుండా మంచి విషయాలు తెలుసుకుని వాటిని ఆచరిస్తూ ఉండాలి.
ఉదయం మేల్కొంది మొదలు భార్యాభర్తలిద్దరూ ప్రతి పనిలోనూ కలిసి మెలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ దగ్గరగా మసలుకోవాలి.
రోజంతా దూరంగా ఉన్న ఫోన్లో మెసేజ్లు చేస్తు, కాల్స్ లో సరదా మాటలు చిలిపి అల్లరులు వీటితో రోజంతా గడపాలి.
భార్య ఇష్టాఇష్టాలని గౌరవించాలి.
రొమాన్స్ కి హద్దులు అనేవి ఉండవు. కళ్ళతో కూడా మీ భాగస్వామికి మీ మనసులోని సందేశాన్ని చేరవచ్చు.
ఇలాంటి చిలిపి పనులతో రోజంతా గడిపి రాత్రివేళ పడకగదిలో చేరిన దంపతుల మధ్య వెలువడే అనురాగం అనంతమైనది. ఆ దంపతుల దాంపత్య జీవితంలో సంతోషాలకు అడ్డూ ఆపూ ఉండదు.





Untitled Document
Advertisements