దసరా పండుగలో శమీవృక్షాన్ని పూజిస్తారెందుకు!

     Written by : smtv Desk | Thu, Oct 07, 2021, 10:04 AM

దసరా పండుగలో శమీవృక్షాన్ని పూజిస్తారెందుకు!

మన హైందవ సంస్కృతిలో ప్రతి పండగ వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆయా పండగ వేళలో అందుకు తగిన తగిన విధంగా భగవంతుడిని పూజిస్తూ ఉంటారు. ఒక్కో పండగవేళ ఒక్కో భగవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గానే దసరా ఉత్సవాలలో శమీవృక్షం పూజించడం అనేది ఆనవాయితీ. అసలు ఈ శమీవృక్షాన్ని దసరా నాడే పూజించడానికి గల కారణం ఏమిటి అంటే.. శమీ వృక్షం ఇది ఒక దేవతా వృక్షం. భృగువు శాపం వల్ల అగ్ని ఎన్నో ప్రదేశాలలో దాక్కుని దేవతలకు కూడా కనిపించలేదు. దేవతలంతా వెతకగా చివరకు అగ్ని శమీవృక్షం యొక్క తొర్రలో కనిపించాడు. అప్పుడు దేవతలందరూ అగ్నికి ఇది పునర్జన్మ గా భావించి, శమీవృక్షం అగ్నిదేవుని మాతృమూర్తిగా భావించి ఈ వృక్షము పూజనీయమని పేర్కొన్నారు. పాండవులు అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధాలు ఈ వృక్షం పై భద్రపరిచారు. ఈ కారణంగానే దసరా నాడు ఆయుధ పూజతో పాటు శమీవృక్షాన్ని కూడా పూజించడం అనేది నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతోంది





Untitled Document
Advertisements