శుభవార్త...ఆ లిమిట్‌ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన RBI

     Written by : smtv Desk | Fri, Oct 08, 2021, 11:21 AM

శుభవార్త...ఆ లిమిట్‌ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన  RBI

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్ల రోజూ వారీ లిమిట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్ ద్వారా ఒకేసారి రూ.5 లక్షలు పంపొచ్చు.

అంతేకాకుండా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. తాజా ద్రవ్యపరపతి సమీక్షలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


ఆర్‌బీఐ నిర్ణయం వల్ల కీలక రెపో రేటు స్థిరంగానే కొనసాగింది. రెపో రేటు 4 శాతం వద్దనే కొనసాగుతోంది. రివర్స్ రెపో రేటు 3.5 శాతం ఉంది. వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని ఈ ఏడాది 9.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం సీపీఐ 5.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. గత పాలసీ సమీక్షతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితులు కుదుటపడ్డాయన్నారు.





Untitled Document
Advertisements