నన్ను ఒంటరిగా వదిలేయండి

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 02:03 PM

 నన్ను ఒంటరిగా వదిలేయండి

‘మేం భార్యాభర్తలుగా విడిపోతున్నాం’ అంటూ నాగ చైతన్య, సమంత ప్రకటించడమే ఆలస్యం మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ‘ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది’, ‘ఆ సినిమాల్లో శ్రుతి మించి నటించడమే ఇందుకు కారణం’, ‘సమంత పిల్లలను వద్దనుకుంది’ అంటూ తమకి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు. అయితే, ఇప్పటి వరకూ వీటిపై పెదవి విప్పని సమంత తాజాగా వాటిపై స్పందించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా రూమర్స్‌కు చెక్‌పెడుతూ పోస్ట్‌ చేసింది. ‘‘నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం దారుణం. మీరనుకునే విధంగా ఎన్నడూ చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా చెదరను’’ అని సమంత ట్వీట్‌ చేసింది.





Untitled Document
Advertisements