ఆకాశాన్ని తాకిన సిలిండర్ ధర...ఇతర వస్తువల ధరలు కూడా పైపైకి

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 11:28 AM

ఆకాశాన్ని తాకిన సిలిండర్ ధర...ఇతర వస్తువల ధరలు కూడా పైపైకి

ఎల్‌పీజీ సిలిండర్ అయిపోయిందా? అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ.1000 కావాలి. డెలివరీ చార్జీలు రూ.30 కలుపుకుంటే.. ఇప్పుడు సిలిండర్ ధర రూ.1000కు సమీపంలో ఉంది. ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. అందుకే దేశంలో సిలిండర్ ధర వెయ్యి రూపాయిలకు చేరువలో ఉంది.

మరి ఒక్క సిలిండర్ ధర రూ.2600 ఎంటని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. మదే దేశంలో కాదు.. పొరుగు దేశమైన శ్రీలంకలో ఒక్క ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేయాలంటే రూ.2657 కావాలంట. గత శుక్రవారం రూ.1400 వద్ద ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2600కు పైగా చేరింది.

శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్యం అయిపోకుండా ఉండేందుకు దిగుమతులపై నిషేధం విధించింది. అలాగే అక్కడి ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రణ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. దీంతో రేట్లు ఆకాశాన్ని తాకాయి. కేవలం గ్యాస్ సిలిండర్ మాత్రమే కాకుండా ఇతర వాటి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. మిల్క్ పౌడర్ కేజీ ప్యాకెట్ కొనుగోలు చేయాలంటే రూ.1,195కు పెట్టాలి. మూడు రోజుల్లో దీని ధర రూ.250 పెరిగింది.





Untitled Document
Advertisements