పదేళ్లలో రూ.10 లక్షలకు రూ.కోటి!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 11:29 AM

పదేళ్లలో రూ.10 లక్షలకు రూ.కోటి!

మ్యూచువల్ ఫండ్స్‌లో MF దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే అధిక రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటుంటారు. పలు మ్యూచువల్ ఫండ్స్ గత పదేళ్లలో ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే రాబడిని అందించాయి. వీటిల్లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి.

ఆదిత్య బిర్లా డిజిటల్ ఇండియా ఫండ్ గత పదేళ్లలో 23 శాతానికి పైగా రాబడిని అందించింది. మీరు 2011 అక్టోబర్ 8న ఈ ఫండ్‌లో రూ.10 లక్షలు పెట్టి ఉంటే.. ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.83 లక్షలు అయ్యేది. అదే సిప్ రూపంలో డబ్బులు పెడుతూ వచ్చి ఉంటే 26 శాతానికి పైగా రాబడి పొందే వారు. అంటే నెలకు రూ.10 వేలు పెట్టి ఉంటే..రూ.50 లక్షల వరకు పొందేవారు.

మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ కూడా గత పదేళ్లలో 25.19 శాతం రాబడిని అందించింది. అంటే మీరు పదేళ్ల కిందట రూ.10 లక్షలు పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.94 లక్షలకు పైగా వచ్చేవి. ఇంకా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా పదేళ్లలో 25.29 శాతం రాబడిని ఇచ్చింది. అంటే రూ.10 లక్షలకు రూ.95 లక్షలు పొందేవారు.

ఇంకా ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా అదిరే రాబడిని అందించింది. పదేళ్లలో 26.07 శాతం రాబడిని ఇచ్చింది. అంటే పదేళ్ల కిందట రూ.10 లక్షలు పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ.1.02 కోట్లు వచ్చేవి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ కూడా పదేళ్లలో 26.39 శాతం రాబడిని ఇచ్చింది. అంటే రూ.10 లక్షలకు రూ.1.04 కోట్లు పొందే వారు.





Untitled Document
Advertisements