కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఇకపై పిల్లలకు

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 04:52 PM

కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఇకపై పిల్లలకు

దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఇకపై పిల్లలకు కూడా వినియోగించనున్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది. కొవాగ్జిన్ సృష్టికర్త భారత్ బయోటెక్ సెప్టెంబరు మాసంలో పిల్లలపై ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన డేటాను పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.

లోతైన పరిశీలన, సంప్రదింపుల అనంతరం అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ నియంత్రిత వినియోగానికి అనుమతి ఇస్తున్నట్టు కమిటీ తెలిపింది. మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ను 20 రోజుల వ్యవధిలో రెండు డోసుల్లో అందించనున్నారు.





Untitled Document
Advertisements