తెల్లవెంట్రుకలను నల్లగా మార్చే చిట్కాలు!

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 05:10 PM

తెల్లవెంట్రుకలను నల్లగా మార్చే చిట్కాలు!

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్య వేధిస్తుంది. ఈ తెల్లజుట్టుని నల్లగా మార్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెన్నా అని, హెయిర్ డై అని, కలరింగ్ అని ఇలా ఎన్నో ప్రయత్నించి తెల్లజుట్టుని నల్లగా మారుస్తారు. అయితే ఇంత కష్టపడి జుట్టుని నల్లగా మారిస్తే ఆ రంగు కొద్దిరోజులు మాత్రమే పైగా ఈ హెయిర్ డైలలో వాడిన రకరకాల కెమికల్స్ వలన మన ఆరోగ్యానికి ఎంతగానో హాని జరుగుతుంది.
అయితే ఎటువంటి హానీ లేకుండా మీ జుట్టుని నల్ల పరుచుకోవడానికి ఆయుర్వేదం లోని కొన్ని చిట్కాలు మీకోసం. ఈ చిట్కాలు గనుక పాటించినట్లయితే ఎటువంటి హెయిర్ డై అవసరం లేకుండానే తెల్లజుట్టును నల్లగా మార్చేసుకోవచ్చు.
* మాచికాయలు, నీలిచెట్టు ఆకులు, పిప్పళ్లు, సైంధవలవణము వీటిని సమభాగాలుగా కలిపి, గంజితో నూరి, తలకు పట్టించి ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి.
* ప్రతి నిత్యము ముక్కు రంధ్రాలలో వేప నూనెను నాలుగు చుక్కల చొప్పున వేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
* నీలిచెట్టువేరు, సైంధవ లవణము, పిప్పళ్ళు వీటిని సమభాగాలుగా తీసుకుని నెయ్యితోనూరి, కొద్దిగా వేడిచేసి తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి.
* నిమ్మకాయ రసం లో ఉసిరిక వలుపునువేసి, మర్దించి తలవెంట్రుకలకు రాసుకుంటే అవి నల్లగా ఉంటాయి.
* నేలతాడి చూర్ణము మేక మూత్రముతో అనుపానముచేసి తాగుతూ ఉంటే తెల్లవెంట్రుకలు నల్లగా మారుతాయి.
* కామంచి ఆకుల రసము, గుంటగలగరాకు రసము వీటిని కలిపి ప్రతిరోజు తలకు రాస్తుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
* వావిలిచెట్టు వేర్ల పైపట్ట పొడిని పూటకు అరతులము చొప్పున ప్రతిరోజు రెండుపూటలా మజ్జిగతో తీసుకుంటే ఒక్కనెలలో తెల్లవెంట్రుకలు నల్లబడుతాయి.





Untitled Document
Advertisements