ఈ ఆహారంతో మలబద్ధకం దూరం..

     Written by : smtv Desk | Tue, Oct 12, 2021, 05:26 PM

ఈ ఆహారంతో మలబద్ధకం దూరం..

చాలా మంది సతమతమయ్యే సమస్యల్లో కాన్స్టిపేషన్ ఒకటి. వివిధ కారణాల వల్ల కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. తక్కువ ఫైబర్ తీసుకోవడం, ఫిజికల్ ఇన్ ఆక్టివిటీ ఇలా మొదలైన కారణాల వల్ల కాన్స్టిపేషన్ సమస్య వస్తుంది. అయితే ఇక్కడ మల బద్దకం సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో తీసుకుంటే కచ్చితంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

* ఆపిల్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక ఆపిల్ తీసుకుంటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు అన్న సంగతి అందరికీ తెలుసు. ఆపిల్స్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఆపిల్ తీసుకోవడం వల్ల బౌల్ మూమెంట్ రెగ్యులర్ అవ్వడానికి సహాయపడుతుంది. అదే విధంగా మలబద్దకం సమస్యకు చెక్ పెట్టడానికి ఆపిల్స్ ఎంతగానో మేలు చేస్తాయి.

* ప్రూన్స్‌లో కూడా చాలా అద్భుతమైన గుణాలు ఉంటాయి విటమిన్ ఎ, ఇ, పొటాషియం కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. డైజెస్టిన్ హెల్త్ కి ఇవి బాగా ఉపయోగపడతాయి. మల బద్ధకం సమస్య నుండి బయట పడడానికి బాగా హెల్ప్ చేస్తాయి. స్టూల్ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది అలానే మలబద్దకానికి పూర్తిగా స్వస్తి చెప్పేస్తుంది.

* కివి మనకి దొరుకుతూనే ఉంటాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇది డైజెస్టివ్ ట్రాక్ట్ కి చక్కటి మేలు చేస్తుంది.

* అవిస గింజలు ఆరోగ్యానికి చక్కటి మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలుసు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కూడా మీరు అవిసె గింజలతో పొందొచ్చు. 10 గ్రాముల అవిసె గింజల్లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కని మేలు చేసింది.

* పియర్స్ కూడా మలబద్ధకం సమస్యను పోగొడతాయి. ఒక మీడియం సైజు పియర్స్‌లో ఆరు గ్రాముల ఫైబర్ ఉంటుంది. మలబద్ధకం సమస్యని ఇది త్వరగా పోగొడుతుంది. ఇందులో ఇతర అద్భుతమైన గుణాలు కూడా ఉంటాయి. అవి కూడా సహాయం చేస్తాయి. కాబట్టి మలబద్ధకం సమస్యతో బాధ పడే వాళ్ళు ఈ పండ్లని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మీరు ఈ పండ్లను తినొచ్చు లేదు అంటే సలాడ్స్, స్మూతీ, శాండ్విచ్ మొదలైన వాటిని తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న వీటి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కనపడతాయి. కాన్స్టిపేషన్ సమస్య కూడా పోతుంది.

* బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ కూడా వీటిలో సమృద్ధిగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి బాగా ఉపయోగపడతాయి. స్టూల్‌ని సాఫ్ట్‌గా మార్చడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బీన్స్ ని కూడా మీరు ఎక్కువగా వాడండి.

* రబర్బ్ కూడా మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. దీనిలో లాక్స్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాన్ని మీరు పొందొచ్చు. ఓట్ మీల్ వంటి వాటిలో దీనిని వేసుకుని తీసుకోవచ్చు. ఇది గట్ హెల్త్ కి చాలా మేలు చేస్తుంది.

* ఆర్టిచోక్స్ ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటుంది ఫైబర్ కూడా దీంట్లో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం పూర్తిగా తగ్గుతుంది. ఇలా దీనితో కూడా మీకు మంచి మేలు కలుగుతుంది. ు.

* కెఫిర్ ఇది ఫెర్మెంటేడ్ మిల్క్ బేవరేజ్. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. గట్ బ్యాక్టీరియాకి కూడా మంచిదే. మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. స్టూల్ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. అలానే ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి వీటిని కూడా మీరు రెగ్యులర్ డైట్ లో తీసుకోండి.

* ఫిగ్స్ వీటిలో కూడా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. బౌల్ మోవ్మెంట్ కి ఉపయోగ పడుతుంది. చాలామంది కాన్స్టిట్యూషన్ సమస్యతో బాధ పడతారు. అలాంటి వారు రెగ్యులర్ గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో 16 శాతం ఫైబర్ ఉంటుంది.

* చిలకడ దుంపలు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధ పడే వాళ్లకు ఇది చాలా మంచిది. ఒక మీడియం సైజు చిలకడదుంపలో నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటుంది. చిలగడ దుంపల్ని ఉడకబెట్టుకొని తీసుకోవచ్చు లేదు అంటే వివిధ రకాల రెసిపీలని తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. మీరు కాన్స్టిపేషన్ సమస్యతో బాధ పడుతున్నట్లయితే తప్పక చిలకడదుంపలు డైట్ లో తీసుకోండి. వెంటనే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది.

* చియా సీడ్స్ కూడా మల బద్ధకం సమస్యను దూరం చేస్తాయి. ఒక ఔన్స్ చియా సీడ్స్ లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం పూర్తిగా దూరం అవుతుంది.

* అవకాడోలో కూడా పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. మలబద్దకం సమస్యని కూడా ఇది దూరం చేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వారికి ఇది చక్కటి సహాయం చేస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండే అవకాడో తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.

* ఓట్ బ్రాన్ ఇందులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది.

చూశారు కదా మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో మలబద్ధకం సమస్య నుండి ఎలా బయట పడవచ్చు అనేది. కనుక ఈ ఆహార పదార్థాలను మీరు మీ డైట్ లో తప్పక తీసుకుంటే కాన్స్టిపేషన్ సమస్య కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఆరోగ్యంగా ఉండొచ్చు.





Untitled Document
Advertisements