శరీరానికి కూడా ఒక బాష ఉంటుందని మీకు తెలుసా!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 12:52 PM

శరీరానికి కూడా ఒక బాష ఉంటుందని మీకు తెలుసా!

మన మనసులో ఏముందో దాన్ని ఎదుటి వారికి చెప్పేందుకు భాష ఉపయోగపడుతుంది. కానీ శరీరానికి కూడా ఒక బాష ఉంటుంది. అది కూడా తన భావాలను వ్యక్తం చేస్తుంది. మాట్లాడటం ద్వారా కాకుండా శరీర కదలిక వల్ల కూడా ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. దీనినే బాడీ లాంగ్వేజ్ అంటారు. శరీర కదలికల్లో చిన్న మార్పులు చేసుకుంటే ఎదుటివారు మనల్ని అర్ధం చేసుకొనే విషయంలో ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు వెనుక చేతులు పెట్టుకొని తల పైకి ఎత్తి గంభీరంగా, నేమ్మాడిగా నడుస్తుంటే గర్వం కలవారిగా కనిపిస్తాం. అదే నడకలో కాస్త వేగాన్ని పెంచి, సూటిగా చూస్తూ, ముఖం పై కాస్త నవ్వు పులుముకుంటే ఆత్మీయుడిగా కనిపిస్తాం. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖం లోకి కాకుండా వేరే వైపు చూస్తే ఆ వ్యక్తి మాటలను నమ్మటం లేదని అర్ధం. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి కళ్ళలోకి చుదడడం అనేది నమ్మకానికి సంకేతం.

Untitled Document
Advertisements