వెలుతురుని బట్టి మన కళ్ళలో మార్పు వస్తుందా!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 01:07 PM

వెలుతురుని బట్టి మన కళ్ళలో మార్పు వస్తుందా!

సాధారణంగా బయట ఎండలో ఎక్కువసేపు ఉండి తిరిగి ఇంట్లోకి రాగానే చీకటిగా అనిపిస్తుంది. అయితే ఇలా చీకటిగా అనిపించడానికి గల కారణం వెలుతురుని బట్టే మన కళ్ళు (రెటీనా పోర)లో మార్పు వస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిపాపలు చిన్నవిగాను, తక్కువగా ఉన్నప్పుడు కంటిపాపలు పెద్దవిగాను ఉంటాయి. అయితే ఎండ తీవ్రత వల్ల కంటిపాపలు చిన్నవవుతాయి. ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు మన కంటిపాపలు చిన్నవిగానే ఉండటం వల్ల వెంటనే మన కళ్ళకు ఏ వస్తువులూ కనిపించవు. అంతా చీకటిగా అనిపిస్తుంది. మన కంటి పాపలు పెద్దగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాతే కళ్ళు మామూలు స్థితికి వస్తాయి.

Untitled Document
Advertisements