కండరాలు పట్టేసే సమస్యకు చెక్ పెట్టండిలా!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 04:06 PM

కండరాలు పట్టేసే సమస్యకు చెక్ పెట్టండిలా!

కండరాలు పట్టే సమస్యకి మొట్ట మొదటి పరిష్కారం నీరు బాగా తాగడం. ఇందువల్ల డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉంటుంది, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ అవుతుంది.
కండరంలో ఒక భాగం కానీ, కండరం అంతా కానీ సంకోచిస్తే కండరాలు పట్టేస్తున్నాయి అంటాం. ఇది చాలా నొప్పిగా ఉండే పరిస్థితి. కొన్ని సెకన్ల నుండీ కొన్ని నిమిషాల వరకూ ఈ నొప్పి ఉండవచ్చు. అథ్లెట్స్, ఇంకా ఇంటెన్స్ వర్కౌట్స్ చేసేవారు ఎక్కువగా ఈ మజిల్ క్రాంప్స్ ని ఎక్స్పీరియెన్స్ చేస్తారు. ఎక్కువగా చెమట పట్టడం, డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ సరిగా ఉండదు, అల్సరేటివ్ కొలైటిస్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోం, లీకీ గట్ వంటి గాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ , డైయురెటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మెడికేషన్స్ యూజ్ చేయడం, థైరాయిడ్, రీనల్ డిసీజెస్ వంటి మెడికల్ డిసార్డర్స్ ఉండడం, థైరాయిడ్, రీనల్ డిసీజెస్ వంటి మెడికల్ డిసార్డర్స్ ఉండడం, అప్పుడు ఈ మజిల్ క్రాంప్స్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది, అంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడు తగినంత నీరు తాగుతూ, పోషకాహారం తీసుకుంటూ ఉండడమే కాక అథ్లెట్స్ స్ట్రెచింగ్, మజిల్స్ మసాజ్, ఐస్ పాక్ అప్లై చేయడం, ఎప్సం సాల్ట్ బాత్ వంటి కొన్ని హోం రెమెడీస్ ని కూడా పాటించవచ్చు. అవసరమైతే మెడికేషన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ సమస్యతో భాదపడుతున్నవారు కిందపెర్కొన్న ఆహారపదర్దాలు తీస్కోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు.
* పుచ్చకాయ మంచి రుచిగా ఉండడమే కాదు, మజిల్ క్రాంప్స్ నుండి రిలీఫ్ ఇచ్చే వాటిలో ఇది మొట్టమొదటగా కూడా ఉంటుంది. ఇందులో నీరు, ఫ్లూయిడ్ ఎలెక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేసే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలం గా ఉంటాయి. అంతే కాక పుచ్చకాయ లో ఉండే సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ బ్లడ్ ఫ్లో ని ఇంప్రూవ్ చేయడం లో హెల్ప్ చేస్తుంది.
* అవకాడో లో మంచి కొవ్వులతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలెక్ట్రొలైట్స్ కూడా ఉంటాయి. ఇవి మజిల్ క్రాంప్స్ ని రెడ్యూస్ చేస్తాయి.
* కొబ్బరి నీటిలో కూడా పొటాషియం లభిస్తుంది. అంతే కాక కొబ్బరి నీటిలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ప్రకృతిలో సహజం గా లభించే ఈ పానియం రుచికీ ఆరొగ్యానికీ పెట్టిన పేరు. ఇది మజిల్ క్రాంప్స్ నుండి కూడా రిలీఫ్ ని ఇస్తుంది. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ వల్ల కొబ్బరి నీరు ఒత్తిడి తగ్గించి మజిల్ రికవరీని సపోర్ట్ చేస్తుంది.
* అరటి పండు ఫిట్నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండడం కోసం ఈ పండ్లు తింటారు. ఇది తక్షణ శక్తిని ఇస్తుంది కాబట్టి వర్కౌట్ ముందు ఈ పండుని తీసుకుంటారు. ఈ పండులో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ మెయింటెయిన్ అవుతుంది, మజిల్ క్రాంప్స్ ప్రివెంట్ చేయవచ్చు.
* చిలకడ దుంప సమృద్ధమైన శక్తిని ఇస్తుంది. విటమిన్స్ ఏ, సీ, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ దుంప లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కానే కాక గాయాలు తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ దుంప లో ఉండే హై పొటాషియం కంటెంట్ వల్ల మజిల్ క్రాంప్స్ ని రెడ్యూస్ చేయవచ్చు.
* ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండి ఉన్న పానీయాల్లో బోన్ బ్రాత్ కూడా ఒకటి. అన్ని ఎస్సెన్షియల్ మినరల్స్, అమైనో యాసిడ్స్, కొలాజెన్ ఇందులో ఉన్నాయి. ఇవి జాయింట్స్, లిగమెంట్స్, టెండన్స్, కార్టిలేజ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఈ బోన్ బ్రాత్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ మెయింటెయిన్ అవ్వడమే కాక మజిల్ క్రాంప్స్ ని ప్రివెంట్ చేఏ న్యూట్రియెంట్స్ కూడా లభిస్తాయి.
* సాల్మన్, సార్డీన్స్, ట్యూనా వంటి ఫ్యాటీ ఫిష్ లో ఈపీఏ, డీహెచ్ఏ రూపంలో ఒమేగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి. వీటికి కల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల జాయింట్ పెయిన్స్, మజిల్ సోర్‌నెస్ నుండి రిలీఫ్ లభిస్తుంది. అంతే కాక, కొన్ని రకాల ఫ్యాటీ ఫిష్ లో మజిల్ స్పాజం ని రిలీవ్ చేసే విటమిన్ డీ కూడా ఉంటుంది. అలాగే, ఫ్యాటీ ఫిష్ లో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, సెలీనియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి.
* పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలలో కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి, ఇవి క్రాంప్స్ వంటి మజిల్స్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ ని ట్రీట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. డైరీ ప్రోడక్ట్స్ ని మంచి క్వాలిటీ కల కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ గా కన్సిడర్ చేస్తారు. మజిల్ గ్రోత్, రిపెయిర్ కి అవసరమైన తొమ్మిది ఎస్సెన్షియల్ ఎమైనో యాసిడ్స్ వీటిలో ఉన్నాయి.
* బొప్పాయి పండు మజిల్ క్రాంప్స్ తగ్గించడంలో పొటాషియం, మెగ్నీషియం లభించే బొప్పాయి పండు కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ హెల్త్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది, జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. ఇందులో ఉన్న హై విటమిన్ కంటెంట్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తుంది.
అయితే, పెయిన్ తరచూ వస్తూ, ఎక్కువ సేపు ఉంటుంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయండం ఉత్తమం.





Untitled Document
Advertisements