మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

     Written by : smtv Desk | Mon, Oct 18, 2021, 05:46 PM

మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

కాలం ఏదైనా వాతావరణం ఎలా ఉన్న అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. రాబోయేది చలికాలం అయితే చలికాలంలో ఎక్కువగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా చలికాలంలోనూ మీ ముఖం అందంగా వెలిగిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.. ఇంట్లో ఉండే పదార్దాలతో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి....
* రోజ్ వాటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ యొక్క పోర్స్ లోపలికి వెళ్ళి బాగా డీప్‌గా క్లెన్స్ చేస్తాయి. కెమికల్స్ నిండి ఉన్న బ్యూటీ ప్రోడక్ట్స్ స్కిన్‌ని క్లెన్స్ చేసినప్పుడు పొడిబారినట్లు చేస్తాయి. కానీ, రోజ్ వాటర్ మాత్రం స్కిన్‌కి అవసరమయిన మాయిశ్చర్‌ని అందిస్తుంది. రెగ్యులర్‌గా రోజ్ వాటర్‌తో క్లెన్స్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సిన గోల్డెన్ గ్లో వస్తుంది.
ఒక కాటన్ బాల్‌ని రోజ్ వాటర్‌లో ముంచి ఫేస్, నెక్ అంతా అప్లై చేసుకోండి. చల్లని నీటితో కడిగేయండి. రేడియెంట్ గ్లో ని ఇన్వైట్ చేయడానికి తయారుగా ఉండండి.
* లెమన్, షుగర్ స్క్రబ్ చేయడం అవసరం. నిమ్మరసంలో ఉండే విటమిన్ సీ యాక్నే స్కార్స్ ని రెడ్యూస్ చేస్తుంది, మచ్చల్ని పోగొడుతుంది. సిట్రిక్ యాసిడ్ మురికి, నూనె, సోప్ వంటి వాటిని రిమూవ్ చేసి స్కిన్ ని కొంచెం లైట్ కలర్ లోకి తెస్తుంది.రెండు టీ స్పూన్ల నిమ్మరసంలో ఒకటిన్నర టీ స్పూన్ల పంచదార వేసి మీ ముఖం, మెడ మృదువుగా స్క్రబ్ చేసుకోండి. ఒక పది నిమిషాలు అలాగే ఉంచేసి కడిగేయండి.
* శనగపిండి, పాలు, పసుపు ఫేస్ ప్యాక్ గురించి ఆయుర్వేదంలో ప్రస్తావిస్తారు. మీకు కావాల్సిన గోల్డెన్ గ్లో ని ఈ ఫేస్ ప్యాక్ ఈజీగా అందిస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిలో అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా పాలు కలిపి స్మూత్ పేస్ట్ లా తయారు చేయండి. ముఖం, మెడ మీద సమానంగా అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.
* స్కిన్ కేర్ లో బయట నుండి చేసే పోషణ ఎంత ముఖ్యమో, లోపలి నుండి పోషణ అందించడం కూడా అంతే అవసరం. అప్పుడే స్కిన్ ఫ్రెష్ గా, కళగా ఉంటుంది. స్కిన్ కి లోపలినుండి నరిష్మెంట్ అందించడం కోసం ఒక అరటిపండు ని మెత్తగా చేసి కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ పల్చగా లేకుండా జాగ్రత్తపడండి. ఈ పేస్ట్ ని ముఖం, మెడ మీద సమానంగా అప్లై చేసి ఆరిపోయిన తరువాత కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే మీ స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ లభిస్తుంది.
* వాతావరణం పొడిగా ఉన్నప్పుడు స్కిన్ కూడా డ్రై అయిపోతుంది. పగిలిపోయినట్లు అయిపోయి గ్లో అంతా పోతుంది. ఈ గ్లో కోసం మీకు కావాల్సింది ఒక కీర దోసకాయ. ఇది స్కిన్ కి అవసరమయిన హైడ్రేషన్ ని అందించడమే కాక స్కిన్ ని చల్లబరుస్తుంది. డార్క్ సర్కిల్స్ ని తగ్గిస్తుంది. కీర దోసకాయని మీడియం సైజ్ లో గుండ్రంగా ముక్కలుగా తరిగి ఫ్రిజ్ లో ఒక గంట సేపు ఉంచండి. ఈ ముక్కలని మీ స్కిన్ మీద ఉంచి పదిహేను నుండి ఇరవై నిమిషాలు కదలకుండా అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత ఈ ముక్కలు తీసేసి చల్లని, లేదా నార్మల్ వాటర్ తో కడిగేయండి. మీ కళ్ళు అలిసిపోయినట్లుగా అనిపిస్తే ఈ ముక్కలని కళ్ళ మీద కూడా పెట్టుకోవచ్చు.





Untitled Document
Advertisements