పండగ తరువాత కూడా వసూళ్ల జోరు తగ్గని 'బ్యాచ్ లర్'

     Written by : smtv Desk | Tue, Oct 19, 2021, 11:46 AM

పండగ తరువాత కూడా వసూళ్ల జోరు తగ్గని 'బ్యాచ్ లర్'

ఇండస్ట్రిలోకి అడుపెట్టినప్పటి నుండి సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న మన్మధుడి తనయుడు అఖిల్
మొత్తానికి 'బ్యాచ్ లర్' గా ఒక హిట్ కొట్టేశాడు .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆయన చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతూ అఖిల్ దూకుడు చూపుతోంది. దసరా పండగ కానుకగా ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రం, ఫస్ట్ డే, ఫస్ట్ షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు రోజులలో 18 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం, మూడో రోజునాటికి 24 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. నైజామ్ నుంచి వచ్చే వసూళ్లు ఒక రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. పండగ తరువాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోవడం విశేషం.
ఈ మూవీ ప్రొడ్యుసర్ గా వ్యవహరించిన బన్నీవాసు మాట్లాడుతూ, ఇంతటి విజయానికి 'బొమ్మరిల్లు' వాసు కథాబలం కారణమని చెప్పడం విశేషం. మొత్తానికి చాలా తక్కువ గ్యాప్ లో 'లవ్ స్టోరీ'తో చైతూ .. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అఖిల్ హిట్ కొట్టడం, నాగార్జునతో పాటు ఆయన ఫ్యాన్స్ అందరిని ఖుషీ చేసే విషయమే.





Untitled Document
Advertisements