సోషల్ మీడియాలో అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పూజ

     Written by : smtv Desk | Tue, Oct 19, 2021, 01:18 PM

సోషల్ మీడియాలో అభిమానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పూజ

సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా చెలరేగిపోతూ రచ్చరచ్చ చేస్తున్న నెటిజన్ల ప్రశ్నలకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఈ ఇంటర్నెట్ యుగంలో ఇంట్లో ఉన్నాప్రైవసీ అనేది కరువైపోతుందనే చెప్పాలి. వ్యక్తిగత విషయాలు మొదలుకొని సామాజిక విషయాల వరకు ప్రపంచం నలుములలా చీమ చిటుక్కుమన్నా ఆ వార్త వైరల్ అవ్వాల్సిందే. తాజాగా ఇటువంటి సంఘటనే కథానాయిక పూజా హెగ్డేకు ఎదురైంది. అందుకు ఆమె ఏవిధంగా తనదైన శైలిలో స్పందించారో చూసేయండి..
తెలుగులో వరుస హిట్లతో దూసుకుపోతోంది హిరోయిన్ పూజా హెగ్డే. ఆమె నటించిన తాజా సినిమా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో సరదాగా ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అంతే దీటుగా బదులిచ్చింది. ‘మన మధ్య ఉన్న బంధం గురించి జనానికి ఎప్పుడు చెప్పేద్దాం?’ అంటూ అతను అడిగిన ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబు చెప్పింది. ‘రక్షాబంధన్’ రోజున చెబుదామంటూ చురక అంటించింది.
జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలన్న అభిమాని ప్రశ్నకు.. ఆయన ‘నిజం’ అంటూ చెప్పింది. రాధేశ్యామ్ ఓ ఎపిక్ లవ్ స్టోరీ అని, అద్భుతమైన విజువల్స్ ఉంటాయని తెలిపింది. తమిళ హీరో విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని, ఆయన స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొంది. అలాగే, కన్నడ ఇండస్ట్రీని కేజీఎఫ్ హీరో యశ్ గర్వించేలా చేశాడని ఆమె చెప్పింది.
పెద్ద హీరోలతో, పెద్ద సినిమాల్లో నటించడం వల్ల తక్కువ నిద్రపోతూ ఎక్కువ విమానాలు ఎక్కేస్తున్నానని చెప్పింది. ఆచార్యలో ‘నీలాంబరి’ పాట విజువల్ పరంగా చాలా బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆ పాట చేసిన క్షణాలను మరచిపోలేనని చెప్పింది.
ఇక చిరంజీవి గారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చూసి తనకు కాంప్లిమెంట్ తో కూడిన మెసేజ్ పంపారని, అది చూశాక మరింత కష్టపడి పనిచేయాలన్న ప్రేరణ కలిగిందని ఆమె తెలిపింది.
అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాలనేది తన కల అని, ఏదో ఒక రోజు ఆ కలను సాకారం చేసుకుంటానని చెప్పింది. ‘ఇన్ టు ద వైల్డ్’ అనే ఇంగ్లిష్ సినిమా చూసి బాగా కలత చెందానని, అది బాగా డిస్టర్బ్ చేసిందని తెలిపింది.


Untitled Document
Advertisements