ఏ నెక్ లైన్ ఎవరికీ బాగుంటుంది..

     Written by : smtv Desk | Tue, Oct 19, 2021, 04:31 PM

ఏ నెక్ లైన్ ఎవరికీ బాగుంటుంది..

మనం మన దుస్తులకు నెక్ లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకునే ముందు క్లాత్ కలర్, స్టైల్, ఫ్యాబ్రిక్ కన్నా నెక్ లైనే చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మనం ఎంచుకునే నెక్ లైన్ స్టైల్ కేవలం మన బాడీ షేప్, బస్ట్ లైన్ సైజ్, షోల్డర్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా మన ఏజ్ను దృష్టిలో పెట్టుకుని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. యువతులు, 30 ఏళ్లు దాటిన మహిళలు ఒకే రకమైన నెక్ లైన్ డిజైన్ ఎంచుకుంటే సరిగ్గా ఉండదు. వయసు మీద పడినవారు యువతులు ధరించే నెక్ లైన్ డిజైన్ ధరించడం వలన చూసేందుకు వారు అందంగా కనిపించరు. కాబట్టి వారు ఆ వయస్సు వారు ధరించే నెక్ లైన్ డిజైన్లను ఎన్నుకోవడం చాలా మంచిది. అసలు మార్కెట్లో ఎటువంటి రకాల నెక్ లైన్ డిజైన్లు అందుబాటులో ఉన్నాయనే విషయం గురించి ఒక్కసారి తెలుసుకుంటే.

ప్రధానమైన నెక్ లైన్ డిజైన్లు.. క్య్రూ నెక్ లైన్, జూవెల్ నెక్ లైన్, U నెక్ లైన్, స్క్వేర్ నెక్ లైన్, V నెక్ లైన్, బోట్ నెక్ లైన్, స్కూప్ నెక్ లైన్, కాలర్డ్ నెక్ లైన్, గ్యాథర్డ్ నెక్ లైన్, స్ట్రాప్ లెస్ నెక్ లైన్, డైమండ్ నెక్ లైన్, కీ హోల్ నెక్ లైన్, స్వీట్ హార్ట్ నెక్ లైన్, హాఫ్ షోల్డర్ నెక్ లైన్, హాల్టర్ నెక్ లైన్, రఫ్ఫల్డ్ నెక్ లైన్, వైడ్ స్వ్కేర్ నెక్ లైన్, హాల్టర్ నెక్ లైన్ విత్ స్ర్టాప్స్, ఎన్వలప్ నెక్ లైన్, స్ర్టాప్ నెక్ లైన్, డెలోకేట్ నెక్ లైన్, వన్ షోల్డర్ నెక్ లైన్,పేపర్ బ్యాగ్ నెక్ లైన్, క్వీన్ ఎలిజబెత్ నెక్ లైన్, కోర్ట్ నెక్ లైన్, హార్స్ షూ నెక్ లైన్, రేసర్ బ్యాక్ నెక్ లైన్, క్వీన్ ఆన్ నెక్ లైన్, వైడ్ స్వ్కేర్ నెక్ లైన్, మీటర్డ్ స్వ్వేర్ నెక్ లైన్, స్కల్లాప్ నెక్ లైన్, స్లాష్ నెక్ లైన్, అసిమెట్రికల్ నెక్ లైన్, ఇల్యూషన్ నెక్ లైన్, యోక్ నెక్ లైన్, బ్యాన్డ్ నెక్ లైన్, బిబ్ నెక్ లైన్, హై నెక్ లైన్.
ఇవే కాకుండా చాలా రకాల నెక్ లైన్ డిజైన్లు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. కావున మనకు సరిపోయే నెక్ లైన్ డిజైన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

క్య్రూ నెక్ లైన్:- ఇది చూసేందుకు రౌండ్గా ఉండి మన నెక్ వద్దకు వచ్చేసరికి చాలా క్లోజ్గా ఉంటుంది. ఎక్కువ ఈ నెక్ లైన్ను మనం టీ షర్ట్స్లో చూస్తాం. ఇవి చూసేందుకు మెడను పట్టేసినట్లు అనిపిస్తుంది. కానీ ధరిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మెడ భాగంలో చిన్నగా ఉన్న వారికి ఈ స్టైల్ నెక్ లైన్ అంతగా సూట్ కాదు. పెద్దగా చాతి వెడల్పు ఉన్న వారికి నారో షోల్డర్స్ ఉన్న వారికి ఈ డిజైన్ సరిగ్గా సరిపోతుంది. ఎవరైతే వ్యక్తులు థిన్ లాంగ్ నెక్ను కలిగి ఉంటారో వారికి కూడా ఈ నెక్ లైన్ సరిగ్గా నప్పుతుంది.

జూవెల్ నెక్ లైన్:- దీని నెక్ లైన్ కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఈ జూయెల్ నెక్ లైన్ అనేది మనం ధరించే రకరకాల దుస్తులలో మనకు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ నెక్ లైన్ స్టైల్కు జూయెల్ నెక్ లైన్ అనే పేరు ఎందుకు వచ్చిందని చాలా మంది సందేహిస్తారు. కానీ ఈ పేరు రావడం వెనుక ఒక విషయం ఉంది. ఈ నెక్ లైన్ డిజైన్ దుస్తులను ధరించినపుడు మహిళలు నెక్లెస్ను ధరించేందుకు వీలుగా ప్లేస్ ఉంటుంది. అందుకోసమే ఈ నెక్ లైన్ స్టైల్ ను జూయెల్ నెక్ లైన్ స్టైల్ అని పిలుస్తారు. ఈ నెక్ లైన్ స్టైల్ అచ్చంగా క్య్రూ నెక్ లైన్ విధంగానే ఉంటుంది. చూసేందుకు రెండు రకాల నెక్ లైన్ డిజైన్లు ఒకే రకంగా అనిపిస్తాయి.

U నెక్ లైన్:- U నెక్ లైన్ కు అసలు ఆ పేరుందుకు వచ్చిందని అందరూ ఆలోచిస్తారు. ఈ నెక్ లైన్ స్టైల్కు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఈ స్టైల్ U షేప్ లో ఉండడం వలన ఈ నెక్ లైన్ స్టైల్ ను అలా పిలుస్తారు. ఈ U నెక్ లైన్ను యూనివర్సల్గా అందరూ లైక్ చేస్తారు. ఈ U నెక్లైన్ అనేది మెడ దగ్గర చాలా విశాలంగా ఉంటుంది. ఇది ధరించిన వారు చాలా సౌకర్యవంతంగా ఫీలవుతారు. ఇది సౌకర్యంగా ఉండడం వలనే అనేక మంది ఈ U నెక్లైన్ ను ఎక్కువగా ఇష్టపడతారు.

స్వ్కేర్ నెక్ లైన్:- నెక్ లైన్ డిజైన్లలో స్వ్కేర్ నెక్ లైన్ డిజైన్ ఒకటి. ఈ నెక్ లైన్ డిజైన్ చూసేందుకు స్వ్కేర్ షేప్ లో మనకు కనిపిస్తుంటుంది. అందువలనే ఈ నెక్ లైన్ ను స్క్వేర్ నెక్ లైన్ అని పిలుస్తారు. ఈ స్వ్కేర్ నెక్ లైన్ మెడ వద్ద స్వ్కేర్ షేప్ లో ఉండి చాలా విశాలంగా ఉంటుంది. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కావున అనేక మంది ఈ స్వ్కేర్ నెక్ లైన్ను ఇష్టపడతారు.

V నెక్ లైన్:- నెక్ లైన్ సెలెక్ట్ చేసుకునేటపుడు కొన్ని ఫ్యాక్టర్స్ను తప్పనిసరిగా చూసుకోవాలని మనం ముందు చర్చించుకున్నట్లు ఈ V నెక్ లైన్ డిజైన్కు అటువంటి అవసరం లేదు. V నెక్ లైన్ ఎవరికైనా ఇట్టే సూటవుతుంది. కానీ ఆపిల్ బాడీ షేప్ ను కలిగి ఉన్నవారికి మాత్రం ఈ V నెక్ లైన్ అనేది లైఫ్ సేవర్ లాగా పనిచేస్తుంది. ఈ V నెక్ లైన్ స్టైల్లో దుస్తులను ధరించడం వలన మన శరీరం పెద్దగా పెరిగినట్లు అవుతుంది. కావున ఈ V నెక్ లైన్ రకం డిజైన్ ను ఎక్కువగా పొట్టి వ్యక్తులు ప్రిఫర్ చేస్తారు.

బోట్ నెక్ లైన్:- బోట్ నెక్ లైన్ను బాటౌ నెక్ లైన్ అని కూడా పిలుస్తారు. ఈ నెక్ లైన్ విధానంలో దుస్తులను ధరించినపుడు మనం ధరించిన దుస్తులు షోల్డర్ వరకు వస్తాయి. అలాగే నెక్ ను పూర్తిగా కవర్ చేస్తుంది. ముందు భాగంలో మరియు వెనుక భాగంలో చాలా హైగా ఉంటుంది. ఈ బోట్ నెక్ లైన్ అనేది బస్ట్ లైన్ ను పూర్తిగా కప్పి ఉంచుతుంది కావున అనేక మంది ఈ బోట్ నెక్ లైన్ ను ధరించేందుకు మక్కువ చూపుతారు. కానీ ఈ విధానంలో నెక్ లైన్ను కుట్టించుకోవడం వలన మన చాతి భాగం కనిపించదు. కావున చాతి భాగం కనిపించేలా దుస్తులను ధరించేలని అనుకునే వారు మాత్రం ఈ స్టైల్లో దుస్తులు కుట్టించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించరు. పియర్ షేప్ బాడీ ఉన్న వారికి, మరియు ఛాతి పరిమాణం చిన్నగా ఉన్న వారికి ఈ విధానం సరిగా సరిపోతుంది. అందుకే అటువంటి వారు ఈ విధానంలో దుస్తులను ధరించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
కావున నెక్ లైన్ను ఎంచుకునే ముందు ప్రతి ఒక్కరూ పై విషయాలను దృష్టిలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం వలన మీరు చాలా అందంగా కనిపించేందుకు ఆస్కారం ఉంటుంది.





Untitled Document
Advertisements