శిశుపాలుని జనన - మరణాలు !

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 11:46 AM

శిశుపాలుని జనన - మరణాలు !

శిశుపాలుడు చేది దేశానికి రాజు. ఇతని పూర్వజన్మలు.. సనక సనాది మహర్షి తదితరుల శాపం వల్ల వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు మూడు సార్లు అసురులుగా జన్మించారు. మొదటిసారి హిరణ్యాక్ష, హిరణ్యకశిపలు, రెండవ సారి రావణ, కుంభకర్ణులు, మూడవసారి శిశుపాల, దంత వాక్రుతులుగా జన్మించారు. శిశుపాలునిగా జననం.. చేదీ రాజైనా దమఘోషుని భార్య శృతశ్రవసు. ఈమె
కు మరో పేరు సాత్వతి. ఈమె శ్రీకృష్ణుని మేనత్త. వాసుదేవుని సోదరి. ఈ రాజ దంపతులకు జన్మించాడు శిశుపాలుడు. ఇతడు మూడు కళ్ళు, నాలుగు చేతులుతో వికృతరూపుడుగా జన్మించి పుట్టగానే గాడిదలా ఏడ్చాడు. ఇతడి జననం చూసి తల్లిదండ్రులు వదిలి వేదమనుకోగా ఒక రాక్షసి ప్రత్యక్షమై ఇతడు తర్వాత అత్యంత శక్తివంతుడు అవుతాడని, ఒకే ఒక్కడు ఇతడిని చంపగలడని అతడు ఇప్పటికే జన్మించాడని, ఎప్పుడైతే ఈ బాలుడు అతన్ని చూస్తాడో ఇతని మూడో కన్ను నశిస్తుందని, అతని తొడపై కూర్చోగానే రెండు చేతులు ఊడిపోతాయి అని చెప్తుంది. ఈ విషయం అన్ని దేశాలకు వ్యాపించింది. ధమ ఘోషుడు ఈ శిశువును వచ్చిన ప్రతి రాజు ఒడిలోను కూర్చోపెట్టాడు. ఒకసారి శ్రీకృష్ణుడు బలభద్ర రాముడు రాగా శిశుపాలుని తల్లి శ్రీకృష్ణుని ఒడిలో కూర్చోబెట్టాగా అతని మూడో కన్ను, రెండు చేతులు ఊడిపోయాయి. శ్రీకృష్ణుని మేనత్త అయిన శృతిశ్రవసు ఎంతో సంతోషించి, కృష్ణుడ్ని తన కుమారుని ఎన్నడు చంపవద్దని దీనంగా వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నూరు తప్పుల వరకూ క్షమిస్తాను అని చెప్పాడు. శ్రీ కృష్ణుడ్ని పెద్దగా ఎన్నుకోవడాన్ని ఆక్షేపించి భీమున్ని అవమానించాడు. కృష్ణుడు శిశుపాలుని నూరు తప్పుల వరకు క్షమించి నూరు తప్పులు పూర్తైన తర్వాత తన సుదర్శన చక్రంతో వధించాడు.





Untitled Document
Advertisements