శిఖండి ఎవరి పునర్జన్మ !

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 01:31 PM

శిఖండి ఎవరి పునర్జన్మ !

అంబ పునర్జన్మ శిఖండి. భీష్ముడ్ని చంపాలనే ప్రతిజ్ఞతో తనువు చాలించి దృపదుడి పుత్రికగా జన్మించింది. ఈమె భీష్ముడిని వధించడానికి అర్జునుడికి సహాయపడింది. అభిమన్యుని వివాహానికి ఉపప్లావం వచ్చింది. ఈమె యక్షుని వలన మగ రూపం పొందిన తరువాత ద్రోణాచార్యుని వద్ద ధనుర్విద్య అభ్యసించింది. మహాభారత యుద్ధం మొదటి రోజు అశ్వత్థామతో యుద్ధం చేసింది. ద్రోణుడిని చూసి యుద్ధరంగం నుండి పారిపోయింది. శల్యుని అస్త్రాన్ని తన దివ్యాస్త్రం తో ఓడించింది. భీష్ముని మరణానంతరం జరిగిన మహా సంగ్రామంలో అశ్వత్థామ శిఖండిని వధించాడు. శిఖండికి గల ఇతర నామాంతరాలు భీష్మహంత్, ద్రుపదాత్మజ, ద్రౌపదేయ, పాంచాల్య.





Untitled Document
Advertisements