శక్తి అనగా ఎవరి రూపం!

     Written by : smtv Desk | Thu, Oct 21, 2021, 05:53 PM

శక్తి అనగా ఎవరి రూపం!

సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం పేరు శక్తి. విశ్వకర్మ సూర్యుని సానబట్టినప్పుడు ఆ రవ్వలు భూమి పై పడగా వాటితో విష్ణు ఆయుధమైన సుదర్శన చక్రాన్ని, శివుని ఆయుధమైన త్రిశూలాన్ని, కుబేరుని పుష్పకవిమానము,  కుమారస్వామి ఆయుధమైన శక్తిని తయారు చేశాడు. శక్తి వశిష్టుని పెద్దకుమారుడు.
'శ ' అనే శబ్దానికి అర్థం భాగ్యం. 'క్తి ' అనగా బలం. శక్తి అనగా సౌభాగ్యం బలము బహూకరించ గల స్త్రీ. భగవతి అనగా జ్ఞానము, సంపద, బలము స్త్రీ లక్షణాల కలయిక.  కాబట్టి శక్తి అనగా భగవతి, శక్తి, దేవి, అంబిక, పార్వతి, ఆమె శివుని దేవేరి. ఈ శక్తి మన దేవతలు అందరిలోనూ ఉంటుంది. ఒకసారి దేవాసుర యుద్ధం సంభవించగా దేవతలు బ్రాహ్మణి, వైష్ణవి, శంకరి, కోమారి, వారాహి, యామ్య, కౌబేరి, వారుణి శక్తులు చంద్రికకు సహాయపడగా దేవతల లోకం ఆనందించింది. వీటితో పాటు శంకరుడు భూమిపై జన్మించి చండికను అభినందించాడు. ఆశక్తి మహిషాసురుణ్ణి  వధించింది.





Untitled Document
Advertisements