ఈ డైటింగ్ లో మీకు నచ్చిన ఆహారం తినొచ్చు..

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 12:41 PM

ఈ డైటింగ్ లో మీకు నచ్చిన ఆహారం తినొచ్చు..

సహజంగా ఒక డైట్ ప్లాన్‌లో రోజుకి ఎన్ని గ్రాములు తినాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుస్తుంది మరియు దాన్నిబట్టి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరి జీర్ణవ్యవస్థ ఒకే విధంగా ఉండదు. దానివల్ల ఆకలి కూడా మారుతూ ఉంటుంది. ఈ ఈటింగ్ పద్దతిని పాటించడం వలన మీ ఆకలి బట్టి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ కడుపు ఫుల్‌గా అనిపిస్తే ఆహారాన్ని తీసుకోకుండా ఉండొచ్చు.
దాంతో పాటుగా ఎటువంటి కాలిక్యులేషన్స్ మీ డైట్ ప్లాన్‌లో ఉండవలసిన అవసరం లేదు. సాధారణంగా ప్రతి ఒక్కరూ పాటించే డైట్‌కు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో కొన్ని నియమాలు ఉండవు. ఈ పద్ధతిని పాటించి ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గరు. కాకపోతే ఈ విధానం పాటించిన వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మొత్తం ఆహారపు అలవాట్లు కూడా మారిపోతాయి. అయితే ఎక్కువ కిలోలు తగ్గరు కానీ కొంత వరకు బరువు పెరిగిపోకుండా నియంత్రించుకోవచ్చు.
మీరు తీసుకునే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి మరియు ఎటువంటి అశ్రద్ధ చేసి ఒకరోజు పాటించక పోయినా ఇంక అదే కొనసాగుతుంది. దాంతో పాటుగా కొంతమంది మూడ్ స్వింగ్స్ బట్టి ఆహారాన్ని తీసుకుంటారు, ఇలా చేయడం వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అమితంగా తింటారు మరికొన్నిసార్లు అసలు తిండి ముట్టుకోరు. ఇలా చేస్తే బరువు తగ్గే అవకాశాలు అస్సలు ఉండవు.
సాధారణంగా ఆకలిలో రెండు రకాలు ఉంటాయి. దాన్నిబట్టి ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉంటాం. ఒకటి ఫిజికల్ హంగర్ రెండవది ఎమోషనల్ హంగర్. ఫిజికల్ హంగర్ అంటే మీ శరీరానికి నిజంగానే ఆహారం అవసరమని. ఫిజికల్ హంగర్ కలిగినప్పుడు అలసిపోవడం, నీరసంగా ఉండడం మరియు చికాకు వంటి లక్షణాలు కనబడతాయి. దీంతో పాటుగా కడుపు నుండి చిన్న శబ్దం వస్తుంది. ఈ ఫిజికల్ హంగర్‌ను తగ్గించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఏమి అవసరం లేదు, ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు.
అయితే ఎమోషనల్ హంగర్ అనేది వంటరిగా ఫీల్ అయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు లేక ఖాళీగా కూర్చున్నప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది. సహజంగా తినాలని అని అనిపించే ఆహార పదార్థాలు ఇవే పంచదార, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు అధిక కొవ్వు ఉన్న పదార్థాలు. ఎమోషనల్ హంగర్ వల్ల ఆహారాన్ని తీసుకుంటే తర్వాత మీకు మీరే తప్పు చేశారన్న భావన కలుగుతుంది.

ఈ ఈటింగ్‌లో ప్రధాన ఉద్దేశం మరియు గమ్యం బరువు తగ్గడం కాదు. కాకపోతే ఈ పద్ధతి బరువు తగ్గడానికి కొంతవరకు సహాయపడుతుంది. ఎందుకంటే ఒక రకమైన డైట్‌ను పాటించడం వల్ల సరైన పోషకాలు తీసుకోలేకపోతారు. ఈ ఈటింగ్ పద్దతిని పాటించడం వల్ల మరొక ముఖ్యమైన ప్రయోజనం ఉంటుంది. అది ఏంటంటే మీరు డైట్‌కు సంబంధించిన ఆహార పదార్థాలను వంట చేయడానికి ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉండదు, పైగా ఇష్టం వచ్చిన ఆహారాన్ని వండుకోవచ్చు. ఈ పద్ధతిని పాటించడం వల్ల మీ శరీరాన్ని మీరు మరింత అర్థం చేసుకుంటారు.
ఎమోషన్స్ కు దూరంగా ఉండి మీ ఆకలి తగ్గించుకోవడానికి ఆహారాన్ని తీసుకుంటారు మరియు కడుపు నిండినప్పుడు ఆహారాన్ని తినడం మానేస్తారు. బరువు తగ్గాలనే ఆలోచనపై ఒత్తిడి పెట్టకుండా మీ శరీరానికి అవసరమయ్యేటువంటి ఆహారాన్ని అందించండి. ఇలా చేయడం వల్ల ఆనందం మరియు ఆరోగ్యం కూడా సొంతమవుతాయి. దాంతో ఎటువంటి ఆరోగ్యపు సమస్యలు రాకుండా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారు.
ఎప్పుడైతే ఒక రకమైన డైట్ ప్లాన్ ను పాటించడం మొదలుపెడతారో ఎమోషనల్ హంగర్ కచ్చితంగా వస్తుంది దాని వల్ల మీ ఆహారపు అలవాట్లు మళ్లీ మారిపోతాయి. ఒక పరిశోధన లో తేలిన విషయం ఏమిటంటే ఈ ఈటింగ్ పద్దతిని పాటించడం వల్ల బరువు పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కొంతమంది బరువు పెరిగిపోతున్నారని ఆందోళన చెందుతూ ఉంటారు. దానివల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఈటింగ్ పద్దతిని పాటించిన వాళ్ళు వారి జీవన విధానాన్ని మార్చుకుంటారు. దాంతో పాటుగా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకోగలిగారు అని నిపుణులు చెబుతున్నారు.

డైట్ ప్లాన్ పాటించాలనే పద్ధతిని ముందుగా మీ మైండ్ నుండి తొలగించండి. ఎప్పుడూ కూడా మంచి పోషక విలువలున్న ఆహారాన్ని ప్రిఫర్ చేయండి. డైట్‌లో భాగంగా ఆహారాన్ని తీసుకోవడం మానేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన పదార్థాలు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ప్రతి పూట అదే విధంగా ఉండాల్సిన అవసరం లేదు లేక 100% పోషక విలువలు అవసరమే లేదు.
ఎప్పుడో ఒకసారి మాత్రమే తినాలి అనుకున్న స్వీట్ లేదా జంక్ ఫుడ్‌ను ఒకసారి తినడం వల్ల బరువు పెరుగరు. ఇష్టమైన పదార్థాలను వద్దు అనుకోవడం వల్ల ఇంకా తినాలనిపిస్తుంది దాంతో ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడంలో తప్పు లేదని గుర్తుంచుకోండి.
ఆకలిగా అనిపించినప్పుడు సరైన మోతాదులో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని శరీరానికి అందించండి. ఎక్కువ సమయం ఆకలితో ఉండడం వల్ల అధిక మోతాదులో ఆహారాన్ని తీసుకుంటారు. దాని వల్ల మరలా మిమ్మల్ని మీరే తప్పుగా అనుకుంటారు.
ఎవరైతే చెడు ఆహారం మరియు మంచి ఆహారం అని లేబుల్ వేస్తారో వారిని దూరంగా ఉంచండి. ఎందుకంటే రోజు వారీ ఆహారంలో ఒక ఆహార పదార్థంపై మీ ఆరోగ్యం ఆధార పడదు అని గమనించుకోవాలి. రోజంతా ఏమి తిన్నారో కూడా అవసరమే అని తెలుసుకోవాలి.
కడుపు ఫుల్‌గా అనిపించినప్పుడు ఆహారాన్ని ఇంక తీసుకో వద్దు. పార్టీలు, పండుగలు మరియు సోషల్ గ్యాదరింగ్స్‌లో కొన్ని కారణాల వల్ల ఒత్తిడితో ఎక్కువ ఆహారాన్ని అంటే అధిక మోతాదు లో తీసుకుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు.
తినే ఆహారాన్ని ఆస్వాదించండి. ఎప్పుడైతే మీరు తీసుకునే ఆహారం రుచిగా ఉంటుందో అప్పుడే మీరు ఆస్వాదించగలుగుతారు. తినే ఆహారాన్ని చాలా త్వరగా తినకండి. ఫోన్ లో మాట్లాడుతూ లేదా నడుస్తూ ఇలా ఇతర పనులు చేస్తున్నప్పుడు ఆహారాన్ని తినొద్దు.
ఆహారాన్ని తీసుకోవడానికి కూడా కొంత సమయం కేటాయించండి. ప్రశాంతకరమైన ప్రదేశంలో కూర్చొని మీ ఆహారాన్ని ఆస్వాదించండి.
మీ ఆహారంపై ఒక కనెక్షన్ ఏర్పడే విధంగా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కొంత ఆహారాన్ని తిన్నా కూడా మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది.
సాధారణంగా చాలా మంది ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఏమైనా తినాలి అనుకున్నపుడు ప్రతి సారి ఫ్రిడ్జ్ దగ్గరకు ఎటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చిన వెంటనే వాకింగ్, మెడిటేషన్, బ్రీతింగ్ మరియు ఫ్రెండ్స్ తో మాట్లాడటం వంటివి చేయండి. ఈ విధంగానే మానసిక ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటే అనవసరంగా ఆహారాన్ని తీసుకోరు.
వ్యాయామాలు చేయండి. శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఆనందంతో పాటు మరి కొంత శాటిస్ఫ్యాక్షన్ పొందుతారు. కాబట్టి బరువు తగ్గే ఆలోచననుమాని, దృఢంగా ఉండాలని, ఎనర్జిటిక్‌గా మారాలని వ్యాయామాలు చేయండి. జీవనశైలిలో భాగంగా వ్యాయామాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.
ఈ ఈటింగ్ పద్ధతిని పాటించడం వల్ల ఎప్పుడు తినాలి మరియు ఎంత మోతాదులో తినాలి అనే విషయం తెలుస్తుంది. దాంతో ఫిజికల్ హంగర్‌కు మాత్రమే మీరు రెస్పాండ్ అవుతారు. దానివల్ల తీసుకునే ఆహారంపై అవగాహన ఉంటుంది. ఈ విధంగా జీవనశైలిలో మంచి మార్పులు కలుగుతాయి. ఎమోషనల్ హంగర్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండండి. దాంతో అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. మీకు కనుక ఈ పద్ధతి నచ్చినట్లైతే మరింత నమ్మకం పెంచుకోవడానికి మరియు సమాచారం తెలుసుకోవడానికి మంచి డైటీషియన్‌ను సంప్రదించండి ఖచ్చితంగా ఈ పద్ధతిని అలవాటు చేసుకోండి.

Untitled Document
Advertisements