బాడీ లోషన్ ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:51 PM

బాడీ లోషన్ ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు!

శీతాకాలంలో గాలిలోని తేమ వలన చర్మం నిగారింపుని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. అందుకే శీతాకాలంలో బాడీలోషన్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. బాడీ లోషన్ రోజు రాసుకోకుండా ఉన్నట్లయితే చర్మం మీద ఏదైనా చిన్నగా గిరుక్కున్న తెల్లని మరక పడిపోతుంది. అలాగే చర్మం బీటలు వారుతుంది అందుకే రోజు ఖచ్చితంగా బాడీలోషన్ అనేది రాయడం అలవాటుగా మార్చుకోవాలి.
మార్కెట్లో రకరకాల బాడీలోషన్ లు అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమందికి అటువంటి కృత్రిమమైన ప్రొడక్ట్స్ వాడటం ఇష్టం ఉండదు. అటువంటి వారికోసం ఇంట్లోనే బాడీ లోషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాడీ లోషన్ తయారీకి కావలసినవి :- నీరు 100 మిల్లీ లీటర్లు. బంతి, గులాబీ,చామంతి ఏదో ఒక రకం పూలను గ్రైండ్ చేసి తీసిన రసం ఒక టేబుల్ స్పూన్. జజోబ, సన్ ఫ్లవర్, విటమిన్ 'ఇ' ఆయిల్ ల మిశ్రమం 100 మిల్లిలీటర్లు. అలోవెరా జెల్ 40 మిల్లి లీటర్లు. సోయాబీన్ వ్యాక్స్ ఒక టేబుల్ స్పూన్. మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ ఐదు మిల్లీలీటర్లు.
* ముందుగా నీటిని మరిగించి పూల రసాన్ని వేసి మంట మీద నుంచి దించి చల్లారే వరకు అలాగే ఉంచాలి.
* తర్వాత ఒక్కొక్కటిగా అన్నింటిని వేసి వ్యాక్స్ కరిగేవరకు సన్నని మంట మీద ఉంచి దించేయాలి. ఇందుకోసం తప్పనిసరిగా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడాలి. మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసేటప్పుడు గ్లాస్ కంటైనర్ వాడవచ్చు.
* వ్యాక్స్ మిశ్రమం కొంచెం చల్లారిన తరువాత స్పూన్ తో గానీ ఎగ్ బీటర్ తో కానీ అన్నీ సమంగా కలిసేటట్లు చేయాలి. ఇలా చేస్తే మృదువైన మిశ్రమం తయారవుతుంది. చివరగా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి బాటిల్ లో నిల్వ చేసుకోవాలి.
* ఈ బాడీ లోషన్ ను స్నానం చేసి తడి లేకుండా తుడిచి న తర్వాత ఒంటికి పట్టించాలి. ఈ లోషన్ అన్ని రకాల చర్మ తత్వాలకు మంచి ఫలితాన్నిస్తుంది.
* శీతల వాతావరణంలో చర్మానికి టానిక్ లా పనిచేసి వాతావరణంలోని మార్పులకు, కాలుష్యానికి చర్మం అందవిహీనంగా మారకుండా నివారిస్తుంది.





Untitled Document
Advertisements