మన రోజుని ఎలా ప్రారంభిస్తే మంచిది?

     Written by : smtv Desk | Fri, Nov 26, 2021, 12:13 PM

మన రోజుని ఎలా ప్రారంభిస్తే మంచిది?

ఉదయం బ్రహ్మముహూర్తం అంటారు. 4 గంటల సమయంలో లేవాలి. చాలా మంది 4 గంటలకే లేవడము కష్టమనుకుంటారు. ఎ ఇబ్బంది లేకుండా లేవాలంటే కొన్ని సూచనలు పాటించాలి సాయంకాలము సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు మిత ఆహారము తినాలి. మనము పడుకునే సమయానికి తిన్న ఆహారము అరిగిపోవాలి. ఎలా కాకుండా రాత్రి పది గంటలకు తింటే రాత్రి ఒంటి గంట వరకు సరైన నిద్రరాదు. జీర్ణాశయముకు రక్త ప్రసరణ ఎక్కువ కావాలి. సరియైన నిద్రపట్టక ఉదయం త్వరగా లేవలేరు. 5,6 గంటల మధ్యలో తింటే ఉదయం 4 గంటలకూ సునాయాసంగా లేవగలుగుతారు. 4 గంటలకూ లేవగానే ముఖం కడగకుండానే లీటరు గోరువెచ్చని నీరు త్రాగాలి. పళ్ళు తోమడానికి వేప, జామ, ఉత్తరేణి, తుమ్మ లేదా ఏదైనా ఒక పుల్లతో పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోమడానికి, ముఖం కడగడానికి, విరోచానానికి కనీసం ౩౦ నుండి 40 నిమిషాలు పడుతుంది. రెండవసారి విరోచనం అయిన తరువాత స్నానము చేయాలి. స్నానానికి కుంకుడు కాయాలు నానబెట్టిగాని, పొడిగాని వాడాలి. ఒంటికి సున్నిపిండి వాడడం మంచిది. పై వన్నీ చేయడానికి ఒక గంట సమయం పడుతుంది. 5 నుండి 6.30 వరకు యోగా చేయాలి.
ఉదయమే టిఫిన్ గానీ తీ గానీ మన అలవాట్లు కావు వేరే దేశపు అలవాట్లు మనదేశాన్ని పరిపాలించినవారు మనకు అలవాటు చేసారు.వారి శీతల దేశములలో సూర్యుడు ఉదయము కనిపించడు కాబట్టి వారు ఉదయము టిఫిన్స్ తింటారు. చల్లటి ప్రదేశము కాబట్టి టీలు త్రాగుతారు. ఇవన్నీ మనము నేర్చుకున్నాము. నిజానికి మనది ఉష్ణ దేశము ఉదయము నుండి వేడి ఉంటుంది. కాబట్టి ఉదయము సూర్యుడు ఉదయించిన 2.30 గంటలలోపు తినడం మంచిది. మధ్యాహాన్నము ఉదయం కంటే తక్కువ తినాలి. మధ్యాహాన్నము కన్న సాయంత్రము తక్కువ తినాలి. మధ్యాహన్నము భోజనము తరువాత 20 నిమిషాలపాటు ఒక కునుకు తీయటము మంచిది. మధ్యలో ఏమి తినకూడదు. సాయంత్రము తినగానే పడుకోకూడదు తిన్నది అరిగిన తరువాత పడుకోవాలి. 6 గంటలలోపు తిన్నప్పుడు 9 గంటల వరకు అరిగిపోతుంది. 9-10 గంటల మధ్యలో పడుకోవడం మంచి పద్ధతి.

Untitled Document
Advertisements