ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల...జీతం రూ.50 వేలకు పైనే

     Written by : smtv Desk | Sat, Nov 27, 2021, 04:47 PM

ఏపీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల...జీతం రూ.50 వేలకు పైనే

AP 1317 Paramedical Staff: ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ (AP Medical and Health Department)లో 1317 పారామెడికల్‌ పోస్టుల (Paramedical Staff) భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

APVVP 896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు:
ఏపీ వైద్య విధాన పరి షత్ (APVVP Recruitment 2021) పరిధిలోని ఆసుపత్రుల్లో 896 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (Civil Assistant Surgeon) శాశ్వత పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం (నవంబర్‌ 21) నుంచి ప్రారంభమైంది. ఇందులో 794 స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, 86 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్, 16 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్‌ 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబరు 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cfw.ap.nic.in/ లేదా http://hmf.ap.gov.in/ వెబ్‌సైట్‌లు చూడొచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి మూడేళ్ల ప్రొబేషన్‌ కాలంలో నెలకి రూ.53,500 చెల్లిస్తారు.

AP వైద్య ఆరోగ్య శాఖలో 1317 ఉద్యోగాలు:
ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ (AP Medical and Health Department)లో 1317 పారామెడికల్‌ పోస్టుల (Paramedical Staff) భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇటీవల వైద్యశాఖలో భారీ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్‌ 21 నుంచి డిసెంబర్‌ 5 వరకు దరఖాస్తులకు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 15వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి 17వ తేదీన ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటిస్తారు. 18వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య అభ్యంతరాల స్వీకరణ.. 21, 22 వ తేదీల్లో అభ్యంతరాల పరిశీలన ఉంటుంది.

ఇక.. డిసెంబర్‌ 23వ తేదీన తుది మెరిట్‌ లిస్ట్‌ను ప్రకటించి.. ఎంపికైన వారికి 27, 28వ తేదీల్లో నియామక ఉత్తర్వులు జారీ ఇస్తారు. ఇక పీహెచ్‌సీల్లో 264 వైద్యుల (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌) పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయిలో మంగళవారం (నవంబర్‌ 23) నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

విభాగాల వారీ ఉద్యోగాల జాబితా:
భర్తీ చేయనున్న 1317 ఉద్యోగాల్లో గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్‌- 149, గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌- 17, ఎఫ్‌ఎన్‌ఓ- 839, శానిటరీ అటెండర్‌, వాచ్‌మెన్‌ పోస్టులు- 312 ఉన్నాయి. వీటిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ ఉద్యోగాలను కాంట్రాక్ట్‌ పద్ధతిలో.. ఎఫ్‌ఎన్‌ఓ, శానిటరీ అటెండర్‌, వాచ్‌మెన్‌ ఉద్యోగాలను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నారు.





Untitled Document
Advertisements