మెగాస్టార్ తో జతకట్టనున్న స్వీటీ నిజమేనా!

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:00 PM

మెగాస్టార్ తో జతకట్టనున్న స్వీటీ నిజమేనా!

దేవసేనగా ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని ముద్రవేసింది అనుష్కశెట్టి. `బాహుబలి` సిరీస్ సినిమాలతో స్వీటీ దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు అనుష్కని పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా నిలబెట్టాయి. అయితే ఈ సినిమా తరువాత అనుష్కపై ఆఫర్ల వర్షం కురిసింది. కరణ్ జోహార్ లాంటి డైరెక్టర్ తనని బాలీవుడ్ లో పరిచయం చేస్తానని ఆఫర్ చేసినా అనుష్క తనకు నచ్చిన సినిమాల్లో మాత్రమే నటిస్తానని బాలీవుడ్ కు వెళ్లే ఉద్దేశం తనకు లేదని చెప్పి షాకిచ్చింది.
`బాహుబలి` తరువాత సెలెక్టీవ్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్న అనుష్క క్యారెక్టర్ నచ్చడంతో `నిశ్శబ్దం` సినిమా చేసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో మరి కొంత సమయం తీసుకున్న అనుష్క ప్రస్తుతం మూవీ క్రియేషన్స్ నవీన్ పొలిశెట్టితో నిర్మిస్తోన్న ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తోంది అనుష్క.
ప్రస్తుతం సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో బిజీగా వుంది అనుష్క. ఇదిలా వుంటే తాజాగా అనుష్కకి యువ దర్శకుడు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలిసింది. `భీష్మ`తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు యువ దర్శకుడు వెంకీ కుడుముల. `భీష్మ` తరువాత కొంత విరామం తీసుకుని మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ వర్కవుట్ కాకపోవడంతో మెగాస్టార్ చిరుకి కథ వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించడానికి ముందుకొచ్చారు.
ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో చిరుకు జోడీగా ఎవరు నటిస్తారన్నది గత కొన్ని రోజులుగా ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా అనుష్క నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇటీవలే ఆమెతో చర్చించిన మేకర్స్ స్వీటీని మెగాస్టార్ కు జోడీగా ఫైనల్ చేశారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొరకు వెయిట్ చేయాల్సిందే.Untitled Document
Advertisements