'సూపర్ మచ్చి' ట్రైలర్ వచ్చేసింది..సంక్రాంతి బరిలో చిరు అల్లుడు!

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:01 PM

'సూపర్ మచ్చి' ట్రైలర్ వచ్చేసింది..సంక్రాంతి బరిలో చిరు అల్లుడు!

చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో పర్వాలేదనిపించిన కళ్యాణ్.. ఇప్పుడు ''సూపర్ మచ్చి'' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వభాద్యతలు పులి వాసు చేపట్టగా, ఇందులో రచిత రామ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
''సూపర్ మచ్చి'' సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'చూడకుండా లవ్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ చాలా బాగుంది.. ఇందులో ఏదో తెలియని ఫీల్ ఉంది' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
రాజు సార్ ఐ లవ్ యూ అంటూ కళ్యాణ్ దేవ్ ప్రేమ కోసం కథానాయిక పరితపిస్తుండగా.. కొన్ని కారణాల వల్ల హీరో ఆమె ప్రేమను అంగీకరించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె తన ప్రేమను వ్యక్తపరచడం ఆపలేదు. అదే సమయంలో హీరోలోని మరో కోణాన్ని చూపించారు. బయటకు రఫ్ గా కనిపిస్తూనే.. లోపల సెన్సిటివ్ గా ఉండే పాత్ర అని తెలుస్తుంది. అయితే అతని వల్ల ఫ్యామిలీకి ఏవో ఇబ్బందులు వచ్చినట్లు కనిపిస్తుంది.
ఈ క్రమంలో రచిత ప్రేమలో పడ్డ కళ్యాణ్.. రాముడుగా మారుతాడా లేదా అనేది ఈ ట్రైలర్ లో చూపించారు. 'సూపర్ మచ్చి' సినిమా లవ్ అండ్ యాక్షన్ అంశాలు కలబోసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు అర్థం అవుతుంది. ఇందులో కళ్యాణ్ దేవ్ పోనీటైల్ తో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. కాకపోతే అతనికి వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్లు తెలుస్తోంది. 'ప్రయాణం ఆపేస్తే.. గమ్యానికి విలువ ఏముంది' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇందులో రాజేంద్రప్రసాద్ - అజయ్ - పృథ్వీరాజ్ - పోసాని కృష్ణ మురళి - ఫిష్ వెంకట్ - రంగస్థలం మహేష్ ఇతర పాత్రలు పోషించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ సినిమాని నిర్మించారు.

Untitled Document
Advertisements