అక్షింతలు ఎందుకు చల్లుతారు!

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:03 PM

అక్షింతలు ఎందుకు చల్లుతారు!

పుట్టినరోజు, పెళ్లి, పేరంటం, పూజ ఇలా శుభకార్యం ఏదైనా సరే మనకన్నా పెద్ద వాళ్ళు మనపై అక్షింతలు వేసి ఆశీర్వదించడం అనేది మన సంప్రదాయంలో ఒక ఆచారం. అయితే ఈ ఆచారం వెనుక వున్న వాస్తవం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. బ్రహ్మ రాతను నుదుటిపై వ్రాస్తాడు. కర్మఫలాలన్నీ తలపైనే వ్రాసి ఉంటాయి. పెళ్లి, పేరంటం వేడుక ఏదైనా సరే ధర్మాత్ములు, పెద్దవారు అక్షింతలు లేదా అక్షితలు మన తలపై వేసి ఆశీర్వదించడం ద్వారా తలరాత కొంతైనా మారుతుందని విశ్వాసము. పెద్దలు వేసిన అక్షింతలు నేలరాలితే వాటిని ఎవ్వరు తొక్కకుండా ఏరి ఎవరూ నడవని ప్రదేశంలో వేయాలి లేదా నీటిలో కలిపేయాలి అని అంటారు పెద్దలు. అక్షతలు అంటే అ + క్షతలు 'క్షతలు' అంటే బాధలు, 'అ' అంటే కలుగకుండా అని అర్ధం. అక్షింతలు వేయడం అంటే బాధలు కలుగకుండా ఉండాలని ఆశీర్వదించడమే.





Untitled Document
Advertisements