కలబందరసంతో అందం, ఆరోగ్యం..

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 04:08 PM

కలబందరసంతో అందం, ఆరోగ్యం..

మీరు బరువు తగ్గలనుకుంటున్నారా .? ఉదయాన్నే గోరువెచ్చని నీరు, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతున్నారా.? అయితే ఇందులో కలబంద రసం కలిపితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..
మనకు ప్రకృతిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే అనేక మంచి పదార్థాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కలబంద ఒకటి. ఆరోగ్యానికి, అందానికి ఆయుర్వేదంలో కలబందను ఉపయోగిస్తారు. కలబంద ఉపయోగాలు తెలిసినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ మొక్కను తమ ఇంటి పెరటిలో పెంచుకుంటున్నారు. ఈ అద్భుతమైన మొక్కతో జెల్స్, క్రీమ్స్, జ్యూస్‌లు తయారవుతున్నాయి. చర్మ సంరక్షణ కోసం కలబందను ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కలబందను తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో మీకు తెలుసా? పోషకాలతో నిండిన ఈ కలబంద మొక్క వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. కలబంద ప్రయోజనాల్లో ఒకటి బరువు తగ్గడంలో కూడా మీకు సాయపడుతుంది. కలబంద విటమిన్స్, ఖనిజాలతో నిండి ఉండటంతో పాటు, కలబందలో కొన్ని యాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. బరువును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. ఇది జీవక్రియను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. దీని వల్ల బరువు తగ్గొచ్చు. కలబందను చాలా రకాలుగా తినొచ్చు.
అయితే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. గర్భిణీలు, తరచూ కడుపు సమస్యలతో బాధపడేవారు, విరేచనాలతో బాధపడేవారు కలబందను తినకూడదు. కలబంద ప్రయోజనాలను పొందడానికి రసం ఉత్తమమైనది. దీనిని సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికాల్స్ తో పోరాడటానికి కలబందలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు సాయపడతాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కలబంద రసం పాకెట్స్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని కొనుక్కోవచ్చు, కలబంద మొక్క నుండి జెల్‌ను తీయొచ్చు. ఇది కొంచెం చేదుగా ఉంటుంది కానీ రుచి కోసం మీరు ఒక టీస్పూన్ తేనెను కలుపుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కొన్ని కిలోల బరువు తగ్గడానికి సాయపడే నిమ్మ, తేనె యొక్క గుణాలతో కూడిన సులభమైన, త్వరగా చేసుకోగలిగే కలబంద రసం రెసిపీ ఇక్కడ ఉంది.
2 టీ స్పూన్లు కలబంద గుజ్జు, ఒక స్పూన్ నిమ్మకాయ రసం, ఒక టీ స్పూన్ తేనే, 5 తరిగిన పుదీనా ఆకులు తీసుకుని, మిక్సీలో వేసి బాగా తిప్పాలి. అంతే కలబంద జ్యూస్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేయండి.
ఇతర మూలికలైన గిలోయ్, ఉసిరి లేదా తులసి వంటి వాటితో కలిపి తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కలబందను తినేటపుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కలబందను ఎక్కువగా తినకూడదు. అలా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. కలబందను ఎప్పుడు తిన్నా తక్కువ మోతాదులో తినాలి.
ప్రతిరోజు ఉదయాన్నే బరువు తగ్గడానికి ఈ కలబంద, నిమ్మ మరియు తేనె కలిపిన రసాన్ని తాగి చూడండి.

Untitled Document
Advertisements