మన్మధుడి నయాలుక్ !

     Written by : smtv Desk | Thu, Jan 13, 2022, 02:52 PM

మన్మధుడి నయాలుక్ !

ఈ మధ్య మన సినీయర్ హీరోలతో పాటు ఈ తరం స్టార్స్ కూడా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తే ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై వుండగానే వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నేచురల్ స్టార్ వరకు ప్రతీ హీరో పరిస్థితి ఇలాగే వుంది. మరి కింగ్ నాగ్ మాత్రం ఊరికే వుంటారా... ఆయన కూడా స్పీడు పెంచేశారు. `బంగార్రాజు`తో జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న నాగార్జున మరో క్రేజీ చిత్రాన్ని ట్రాక్ లో పెట్టారు.

ఈమధ్య మన ఓల్డ్ ఏజ్ స్టార్స్ కుర్ర హీరోలతో పోటి పడుతూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ తమ సత్తాని చాటుకుంటున్నారు. ఒక సినిమాలో నటిస్తూనే మరో చిత్రాన్ని ట్రాక్ లో పెడుతున్నారు. మెగాస్టార్ నుంచి న్యాచురల్ స్టార్ వరకు దాదాపు హీరోలందరూ ఇదే పనిలో ఉన్నారు. మరి మన నాగ్ మామ ఊరుకుంటాడా.. ఆయన కూడా తన దూకుడు పెంచేసాడు. జనవరి 14న `బంగార్రాజు`తో సంక్రాంతి పండుగ నాడు సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకోస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవడానికి ముందే మరో ప్రాజెక్ట్ ని లైన్లో పెట్టేసారు.
`బంగార్రాజు` థియేటర్లలో సంక్రాంతికి సందడి చేయబోతుండటంతో మన్మధుడు తన తదుపరి సినిమాకి రెడీ అయిపోయారు. కెరీర్లో తొలిసారి `రాజు గారి గది -2` మూవీతో తొలి థ్రిల్లర్ లో నటించిన నాగ్ తాజాగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో `ది ఘోస్ట్` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఇది హారర్ థ్రిల్లర్ మాత్రం కాదండోయ్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో కింగ్ కు జోడీగా సొనాల్ చౌహాన్ నటిస్తోంది. ముందు ఈ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో అమలాపాల్ మెహ్రీన్ లు భారీగా డిమాండ్ చేయడంతో చివరికి సొనాల్ చౌహాన్ ని ఫైనల్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో వుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున కత్తిపట్టుకుని క్లీన్ షేవ్ తో హత్యలు చేస్తూ కనిపిస్తాడు.
కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఈ మూవీలో నాగార్జున సరికొత్త గెటప్ లో మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్ తో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రిటైర్డ్ రా ఏజెంట్ గా నాగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఇదేనంటూ గుబురు మీసాలు గడ్డంతో కనిపిస్తున్న మన్మధుడి స్టిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాలంటే మేకర్స్ వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.

Untitled Document
Advertisements