తగ్గిన బంగారం..పైకేగిసిన వెండి ధరలు!

     Written by : smtv Desk | Wed, Jan 19, 2022, 01:04 PM

తగ్గిన బంగారం..పైకేగిసిన వెండి ధరలు!

బంగారం కొనాలి అనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్తే! అవునండి హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పసిడి ధర కొద్దిగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 20 క్షీణించింది. దీంతో బంగారం ధర రూ. 49,070కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 20 క్షీణించింది. దీంతో బంగారం రేటు రూ. 44,970కు దిగొచ్చింది.
బంగారం ధర స్వల్పంగా తగ్గితే.. వెండి రేటు మాత్రం జిగేల్ మంది. పైకి కదిలింది కేజీ వెండి ధర రూ.300 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.65,800కు చేరింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర ఈరోజు పైకి చేరడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర జిగేల్ మంది. పసిడి రేటు పెరిగింది. ఔన్స్‌కు 0.02 శాతం ఎగసింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1812 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 23.49 డాలర్లకు క్షీణించింది.







Untitled Document
Advertisements