పవర్ స్టార్ చిత్రంలో విలన్ గా కోలివుడ్ హీరో!

     Written by : smtv Desk | Wed, Jan 19, 2022, 01:07 PM

పవర్ స్టార్ చిత్రంలో విలన్ గా కోలివుడ్ హీరో!

పవర్ స్టార్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. `వకీల్ సాబ్`తో మూడేళ్ల విరామం తరువాత మళ్లీ అలరించడానికి ఫ్యాన్స్ ముందకొచ్చారాయన. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే మలయాళ రీమేక్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా `భీమ్లా నాయక్` చేశారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా వుంది.
`భీమ్లా నాయక్` చిత్రం తరువాత ఆయన చేస్తున్న సినిమాలు క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్సింగ్`. ఈ రెండు సినిమాల్లో `హరి హర వీరమల్లు` రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. అయితే ఒకే సారి `హరి హర వీరమల్లు` `భవదీయుడు భగత్సింగ్` సినిమాలను పూర్తి చేయాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారట. `గబ్బర్ సింగ్ ` కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో `భవదీయుడు భగత్సింగ్` పై పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు.
అంతేకాక ఈ చిత్రంలో పవర్ స్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో భగత్సింగ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందని ఈ క్యారెక్టర్ కోసం హరీష్ శంకర్ చాలా కేర్ తీసుకుంటున్నారని సినిమాకు ఈ క్యారెక్టర్ హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ఈ క్యారెక్టర్ తెరపై మరింత శక్తివంతంగా వుండాలంటే దాన్ని ఢీకొట్టే ధీటైన విలన్ వుండాలని ఇందు కోసం ఓ తమిళ కథనాయకుడిని దర్శకుడు హరీష్ శంకర్ సంప్రదిస్తున్నారట.
అతను మరెవరో కాదు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ హీరోగా నటించిన `మాస్టర్` వైష్ఫవ్ తేజ్ నటించిన `ఉప్పెన` సినిమాల్లో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ తో ఢీకొట్టే విలన్ గా విజయ్ సేతుపతి అయితేనే బాగుంటుందని రెండు పాత్రలు పోటీపోటీగా వుంటాయిని ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని దర్శకుడు హరీష్ శంకర్ బలంగా నమ్ముతున్నారట. అయితే విజయ్ సేతుపతి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని వస్తే `భవదీయుడు భగత్సింగ్` ఓ రేంజ్ లో వుంటుందని చెబుతున్నారు.

Untitled Document
Advertisements