మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలా..అయితే ఈ వేలంలో పాల్గొనండి

     Written by : smtv Desk | Thu, Jan 20, 2022, 11:52 AM

మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలా..అయితే ఈ వేలంలో పాల్గొనండి

సొంతిల్లు కొనుక్కోవాలనుకునే వారికి పంజాబ్ నేషనల్ బ్యాంకు అపూర్వమైన అవకాశం తీసుకొచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఈ- వేలం చేపడుతోంది. ఈ వేలంలో దేశంలో ఎక్కడ నుంచైనా మీరు ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈ జనవరి 31, 2022న మెగా ఈ-ఆక్షన్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఆసక్తిగల ఇళ్ల కొనుగోలుదారులు తమ అధికారిక వెబ్‌సైట్‌ pnbindia.inలోకి లాగిన్ అయి వివరాలు తెలుసుకోవాలని కస్టమర్లకు సూచించింది.
జనవరి 31, 2022న నిర్వహించే మెగా ఈ-ఆక్షన్‌తో మీ కలల ప్రాపర్టీలను(రెసిడెన్షియల్, కమర్షియల్) సొంతం చేసుకోండని అంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ యాక్ట్ కింద పారదర్శకంగా నిర్వహించే ఈ వేలంలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలు మెగా ఈ-ఆక్షన్‌ను రానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీలను వేలం వేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు.
వేలంలో ఎలా పాల్గొనాలి..?
ఆసక్తిగల కస్టమర్లు ibapi.inలోని e-Bikray portal లోకి లాగిన్ అవ్వాలి. ఐబీఏపీఐ పోర్టల్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ పాలసీ కింద పనిచేసే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్యక్రమం. బ్యాంకులు ఆన్‌లైన్‌గా నిర్వహించే ప్రాపర్టీల వివరాలను తెలిపేందుకు ఇది కామన్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది. ఇండియన్ బ్యాంకులు వేలంలో ఉంచిన ప్రాపర్టీల వివరాలు, వాటి ప్రాంతాలను తేలికగా కస్టమర్లు తెలుసుకునేందుకు ఐబీఏపీఐ పోర్టల్ సాయపడుతుంది. మీరు ప్రాపర్టీని ఎంపిక చేసుకుంటే, నేరుగా బ్యాంకు ఈ-ఆక్షన్ సైట్‌కి ఇది తీసుకెళ్తోంది. ప్రస్తుతం 21 బ్యాంకులు ఈ పోర్టల్‌పై ఉన్నాయి. రిజిస్ట్రేషన్, లాగిన్ అవసరం లేకుండా యూజర్లు నేరుగా ఈ పోర్టల్ యాక్సస్ పొందవచ్చు.





Untitled Document
Advertisements