కుర్రజంట ప్రేమాయణం! నిజమేనా!

     Written by : smtv Desk | Thu, Jan 20, 2022, 11:54 AM

కుర్రజంట ప్రేమాయణం! నిజమేనా!

ఫిల్మ్ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవే లేదు. ఏ ఇద్దరు హీరోహీరోయిన్లు కాస్త చనువుగా ఉన్నా.. కలిసి తిరిగినా వారిద్దరి మధ్య ఎదో జరుగుతుంది అంటూ కొత్తకొత్త రూమర్స్ క్రీయేట్ చేయడం అనేది సర్వసాధారణం.
అలాగే కొన్నికొన్ని సార్లు ఓ అడుగు ముందుకేసి ఫలానా జంటకు నిశ్చితార్థం జరిగిపోయిందని రాస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని గాసిప్స్ సృష్టిస్తుంటారు.అయితే గాసిప్ రాయుళ్ల వార్తలను నిజం చేసిన జంటలు కూడా కొన్ని ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ యువ హీరో ఒకరు ఓ యంగ్ బ్యూటీతో ప్రేమాయణం సాగిస్తున్నారనే ఓ హాట్ గాసిప్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ లో ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన సదరు హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇప్పటికే పలు క్రేజీ చిత్రాల్లో నటించిన హీరోయిన్.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. గతంలో వీరిద్దరూ కొన్ని సినిమాల్లో జంటగా కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి క్లోజ్ అయ్యారని అనుకుంటున్నారు. అయితే ఆ హీరోయిన్ కి పెళ్లి ప్రపోజ్ చేయడానికి యంగ్ హీరో ఇప్పుడు ఓ ఖరీదైన రింగ్ కొనుగోలు చేశాడట.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యువ హీరోహీరోయిన్ల మధ్య వ్యవహారం గురించి ఈ గాసిప్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇది వట్టి గాలి వార్తేనా? ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Untitled Document
Advertisements