రైల్వేల్లో పని ఒత్తిడి తో 77 మంది స్వచ్చంద పదవి విరమణ ..

     Written by : smtv Desk | Thu, Apr 14, 2022, 02:25 PM

రైల్వేల్లో పని ఒత్తిడి తో 77 మంది స్వచ్చంద పదవి విరమణ ..

గతేడాది జులైలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అశ్వనీ వైష్ణవ్ .భాధ్యతలు చేపట్టిన మరు క్షణమే ఆయన అధికారుల పని తీరుపై కొన్ని వ్యాఖ్యలు చేసారు .అయితే ఆ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు .‘‘పనితీరు సరిగ్గా లేనివారు, అవినీతికి పాల్పడే వారికి రైల్వేలో చోటు లేదని మంత్రి స్పష్టం చేశారు.. అటువంటి వాళ్లు వీఆర్‌ఎస్ తీసుకోవడం లేదా బయటకు పంపడం జరుగుతుంది అని చెప్పారు.. మంత్రి వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో తీసుకున్నవారు, ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నవారు గుర్తింపు పొందుతారు’’
పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించిన వెంటనే ఏప్రిల్ 1 నుంచి రైల్వే ప్రాజెక్ట్‌ బిడ్‌లకు ఆహ్వానానికి ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని జనరల్ మేనేజర్‌లు, ప్రాజెక్టులకు బాధ్యత వహించే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు.కేవలం ఈ సంవత్సర ప్రారంభంలోనే జనవరిలోనే కనీసం 11 మంది అధికారులు రాజీనామా చేసినట్టు తేలింది. క్లిష్టమైన లక్ష్యాలను నిర్దేశించడంతో పనితీరు మెరుగుపరుచుకోవడంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు వివిధ రైల్వే జోన్‌లలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఇంజినీర్లు అంగీకరిస్తున్నారు. ‘‘రైల్వేలో ఉన్నత స్థాయి నుంచి తీవ్రమైన పర్యవేక్షణ కారణంగా గత కొన్ని నెలలుగా పరిస్థితులు చాలా మారిపోయాయి.. తమకు ఆశించిన పదోన్నతి రాలేదని కొందరు వీఆర్‌ఎస్‌ కూడా తీసుకున్నారు.. ఓ సందర్భంలో పదవికి రాజీనామా చేయమని ఓ అధికారిని మంత్రి కోరడంతో ఆయన లాంగ్ లీవ్‌పై వెళ్లిపోయారు’’ అని మరో అధికారి అన్నారు.పనితీరు సక్రమంగా లేని అధికారులు ఇటీవలి కాలంలో విమర్శలకు గురవుతున్నారు.మరికొందరేమో పనిభారం ఎక్కువ అవుతుందని దిని వాళ్ళ వారిపై ఒత్తిడి ఎక్కువ అవుతుందని చాలా వరకు అధికారులు విఆర్ఎస్ లు తీసుకొని వెళ్ళిపోయారు .
పని నిర్వహణలో ఒత్తిడి ఎక్కువ కావడంతో 9 నెలల కాలంలోనే 77 మంది సీనియర్ రైల్వే అధికారులు విఆర్ఎస్ తో వెళ్లిపోయారని అధికార యంత్రాంగం వెల్లడించింది.అయితే ఈ సారే ఎక్కువ మంది అధికారులు స్వచ్చందంగా పదవి విరమణ చేసారని ఆ వర్గాలు తెలిపాయి .





Untitled Document
Advertisements