'ఎఫ్ 3' చిత్రం నుండి మాస్ సాంగ్..

     Written by : smtv Desk | Fri, Apr 22, 2022, 11:23 AM

'ఎఫ్ 3' చిత్రం నుండి మాస్ సాంగ్..

వెంకటేష్ వరుణ్ ల కాంబోలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. భార్యలను అదుపులో పెట్టుకోవాలనుకునే భర్తల పాత్రలో ఈదారు హీరోలు సినిమా ఆద్యంతం అంతేగా అంతేగా అంటూ కడుపుబ్బా నవ్వించారు. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో పంచ్ డైలాగ్స్, మంచి కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక తమన్న దొంగ ఏడుపులు ఏడుస్తూ భర్తను బ్లాక్మెయిల్ చేసే భార్య పాత్రలో సగటు ఇల్లాలుగా చక్కగా నటించారు. ఇక మెహ్రీన్ హనీ ఇస్ ది బెస్ట్ అంటూ ఇన్నోసెంట్ ఫేస్ తో అందరిని ఆకట్టుకుంది.
అయితే తాజాగా 'ఎఫ్ 2' తారాగణంతో 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను, మే 27వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. ఆయన స్వరపరిచిన 'ఊ ఆ అహ అహ' అనే పాటను తాజాగా విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సునిధి చౌహాన్ .. లవిత లోబో .. సాగర్ .. అభిషేక్ పాడారు. ప్రధానమైన జంటలపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది.
ఈ పాటలో తమన్నా .. మెహ్రీన్ తో పాటు సోనాల్ కూడా మెరవడం విశేషం. మాస్ ఆడియన్స్ కోసం దేవిశ్రీ చేసిన ఈ ట్యూన్ వాళ్లకి కనెక్ట్ అయ్యేలానే ఉంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. అంజలి .. సంగీత ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ కానుంది.

Untitled Document
Advertisements