నేడు పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులేదు..

     Written by : smtv Desk | Tue, Apr 26, 2022, 10:45 AM

నేడు పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులేదు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 26న కూడా ఇంధనం ధరలలో ఎలాంటి మార్పు లేదు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రెట్లు వరుసగా 20వ రోజు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంధనం రిటైలర్ల ప్రకారం చూస్తే హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు ఇప్పుడు 119.47గా, డీజిల్ రేటు రూ.105.47 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా రేట్లు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. స్థానిక పన్ను విధింపు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దేశంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ రేట్లను అనుగుణంగా ప్రతి రోజూ రేట్ల సవరణ ఉంటుంది. అయితే గత ఏడాది నవంబర్ నుంచి ఇంధనం ధరలు నాలుగు నెలల పాటు స్థిరంగానే ఉంటూ వచ్చాయి. మార్చి 22 నుంచి ధరల పెరగడం ప్రారంభం అయ్యింది. అయితే మళ్లీ ఏప్రిల్ 4 నుంచి రేట్లు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి. ఈ మధ్యలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 మేర పెరిగాయి.
దేశంలో పోర్ట్ బ్లయిర్‌లో పెట్రోల్ ధర అతితక్కువగా ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ కొనాలంటే రూ.91.45 చెల్లిస్తే సరిపోతుంది. అదే భారత్‌లో పెట్రోల్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గమనిస్తే.. ఇందులో మహరాష్ట్రలోని పర్భానీ టాప్‌లో ఉంది. ఇక్కడ పెట్రోలో రేటు రూ.123.47గా కొనసాగుతోంది. అదేసమయంలో డీజిల్ రేటు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో డీజిల్ రేటు ఎక్కువగా రూ.107.68 వద్ద ఉంది.





Untitled Document
Advertisements