తగ్గిన వెండి.. స్థిరంగా బంగారం ధరలు..

     Written by : smtv Desk | Tue, Apr 26, 2022, 10:49 AM

తగ్గిన వెండి.. స్థిరంగా బంగారం ధరలు..

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది ఈ నేపధ్యంలో ఏప్రిల్ 26న ఏపీ, తెలంగాణలో బంగారం ధరలను గమనిస్తే.. ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగాయి. అంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,440 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990 వద్ద ఉంది. 10 గ్రాములకు ఈ ధరలు వర్తిస్తాయి. కాగా నిన్నబంగారం ధర రూ.340 వరకు పడిపోయిన విషయం తెలిసిందే. ఇక వెండి విషయానికి వస్తే.. ఏకంగా రూ.1100 పడిపోయింది. కేజీకి రూ.70,500కు తగ్గింది . వెండి గత ఐదు రోజులుగా నేలచూపులు చూస్తూనే ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వు మే నెలలో కీలక ఫెడ్ రేటును 0.5 శాతం మేర పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా తర్వాతి సమావేశాల్లో కూడా రేట్ల పెంపు ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ట్రేడర్లు ఈ అంశం గురించే ఆలోచిస్తున్నారు. అలాగే బాండ్ ఈల్డ్ కూడా పెరుగుతోంది. అమెరికా డాలర్ బలపడుతోంది. రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు అన్నీ పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తలు వంటి అంశాలు బంగారం ధరలకు కొంత మేర మద్దుతు కల్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగారాన్ని సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చెప్పుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పడిపోతూనే వస్తోంది. గోల్డ్ రేట్లు ఏకంగా నాలుగు వారాల కనిష్టానికి తగ్గాయి. వెండి రేటు కూడా ఇదే ట్రెండ్‌ అనుసరిస్తోంది. సిల్వర్ రేటు 9 వారాల కనిష్టానికి దిగివచ్చింది.





Untitled Document
Advertisements